కొందరు వ్యక్తులు ఎంత పాపులరో వారి ధరించే వస్తువులు కూడా అంతగా పాపులర్ అవుతారు. క్షణాల్లో ఆ వస్తువులకు విపరీతమైన డిమాండ్ పెరుగుతుంది. జనాలు వాటికోసం ఎగబడతారు. సరిగ్గా వెనిజులా అధ్యక్షుడు ధరించిన డ్రస్ గురించి ఇప్పుడు నెటిజన్లు తెగ వెతుకుతున్నారు. ఆ వివరాలు ఏమిటో మీరే చదవండి.. జనవరి 3, 2026న వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురోను అమెరికా దళాలు బంధించిన సంగతి తెలిసిందే. ఈ ఉదంతం ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అయితే రాజకీయ పరిణామాల కంటే ఎక్కువగా ఇప్పుడు మరో విషయం ట్రెండ్ అవుతుంది.
Read also: Iran: జాడలేని ఖమేనీ..పారిపోయార వార్త నిజమేనా?

Maduro caught wearing American brand clothing
అదే మదురో ధరించిన ట్రాక్ సూట్. అరెస్ట్ సమయంలో మదురో ధరించిన ట్రాక్ సూట్. అరెస్టు సమయంలో మదురో ధరించిన నైకీ ట్రాక్ సూట్ ఇపుడు ఇంటర్నెట్ లో హాట్ టాపిక్ అయింది. వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురోను (Nicolas Maduro) అమెరికా దళాలు బంధించి, విమానంలో అమెరికాకు తరలిస్తున్న ఫొటోను అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. చేతులకు బేడీలు, కళ్లకు గంటలకు ఉన్న మదురో ఫొటో క్షణాల్లో వైరల్ అయింది. అయితే ఇప్పుడు నెటిజన్ల కన్ను ఆయన వేసుకున్న నైకీ ట్రాక్ సూట్ పై పడింది.
మదురో సూట్ వివరాలు
మదురో తల నుండి కాలా వరకు ధరించిన వస్తువుల ధరలు, బ్రాండ్ వివరాలను నెటిజన్లు జూమ్ చేసి మరీ కనిపెట్టారు. నైక్ బ్రాండ్ లో అతనయంత పాపులర్ కలెక్షన్. జాకెట్ ధర రూ.11,700, ప్యాంట్ ధర సుమారు రూ.10,000 మొత్తం సెట్ ధర రూ.22,000 వరకు ఉంటుంది. నికోలస్ మదురో ఎప్పుడూ అమెరికాను, అక్కడి పెట్టుబడిదారీ విధానాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తుంటారు. కానీ, ఆయన అరెస్ట్ సమయంలో ఏకంగా ఒక అమెరికన్ దిగ్గజ బ్రాండ్ దుస్తుల్లోనే కనిపించారు. ఇదొక పెద్ద ‘ఐరనీ’ అని విమర్శకులు ఎద్దేవా చేస్తున్నారు. ఇంటర్నెట్ లో ప్రస్తుతం మదురో అరెస్టు ఫొటోతో పాటు ఆయన ధరించిన నైకీ సూట్ కూడా ట్రెండ్ అవుతోంది. అయితే ఫొటో వైరల్ అయిన కొన్ని గంటల్లోనే అమెరికాలోని నైకీ వెబ్ సైట్ లో ‘గ్రే కలర్’ టెక్ స్టీస్ స్టాక్ అయిపోయిందని సమాచారం.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: