వెనిజులాలో(Venezuela) శనివారం తెల్లవారుజామున జరిగిన ఒక మెరుపు దాడి ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. అమెరికా(America) సైన్యం చేపట్టిన ఆపరేషన్ అబ్సొల్యూట్ రిసాల్వ్ ద్వారా వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురో, ఆయన భార్య సిలియా ఫ్లోర్స్‌లను అమెరికా ప్రత్యేక బలగాలు అదుపులోకి తీసుకున్నాయి.
2 గంటల 28 నిమిషాల్లో ముగిసిన మిషన్
ఈ ఆపరేషన్ శుక్రవారం అర్ధరాత్రి ప్రారంభమై, శనివారం తెల్లవారుజామున 4:29 గంటలకు ముగిసింది. (Venezuela) అమెరికా టైం ప్రకారం శుక్రవారం రాత్రి 2 గంటల ప్రాంతంలో ఎయిర్ ఫోర్స్ దాడులతో వెనిజులా వైమానిక రక్షణ వ్యవస్థను ధ్వంసం చేశారు. తెల్లవారుజామున 2:01 గంటలకు అమెరికా డెల్టా ఫోర్స్ హెలికాప్టర్లలో కరాకస్‌లోని ‘ఫ్యూర్టే టియునా’ సైనిక స్థావరానికి చేరుకుంది. కేవలం 30 నిమిషాల్లోనే మదురోను ఆయన నివాసంలో బంధించారు. పట్టుబడే సమయంలో ఆయన తన భార్యతో కలిసి సేఫ్ రూమ్‌లోకి పారిపోయే ప్రయత్నం చేసినట్లు సమాచారం.
Read also: Venezuela US action : వెనెజువెలా తర్వాత ఎవరు? ట్రంప్ హెచ్చరికలు

సీక్రెట్ ఆపరేషన్ – CIA నిఘా
ఈ మిషన్ వెనుక CIA, FBI, నేవీ కలిసి పనిచేశాయి. ఆగస్టు నుంచే CIA అధికారులు వెనిజులాలో ఉండి మదురో కదలికలపై నిఘా పెట్టారు. డైలీ రొటీన్ పనులు గమనించడంతో ఆయన ఎక్కడ నిద్రపోతారు, ఎవరిని కలుస్తారు అనే వివరాలను సేకరించారు. స్టెల్త్ డ్రోన్లను ఉపయోగించి అత్యంత రహస్యంగా ఈ నిఘా కొనసాగింది. మదురోను తొలుత యుద్ధనౌక USS ఇవో జిమా ద్వారా గ్వాంటనామో నావల్ బేస్‌కు, అక్కడి నుండి ప్రత్యేక విమానంలో న్యూయార్క్‌కు తరలించారు. ప్రస్తుతం మదురో, ఆయన భార్య బ్రూక్లిన్ డిటెన్షన్ సెంటర్‌లో ఉన్నారు. మదురోపై నార్కో-టెర్రరిజం, డ్రగ్స్ స్మగ్లింగ్ వంటి తీవ్రమైన కేసులు నమోదయ్యాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫ్లోరిడా నుండి ఈ మిషన్‌ను ప్రత్యక్షంగా వీక్షించారు. వెనిజులాలోని భారీ చమురు నిల్వలను పునరుద్ధరించేందుకు ఈ చర్య తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read also: