వెనెజువెలాపై(Venezuela Crisis) అమెరికా చేపట్టిన ఆకస్మిక మెరుపు దాడులు దేశాన్ని తీవ్ర సంక్షోభంలోకి నెట్టేశాయి. ముందస్తు హెచ్చరికలు లేకుండానే జరిగిన ఈ దాడుల్లో కీలక మౌలిక వసతులు, విద్యుత్ గ్రిడ్‌లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఫలితంగా రాజధాని కారకాస్‌తో పాటు అనేక నగరాలు, పట్టణాలు చీకట్లో మునిగిపోయాయి.
Read also: Nicolas Maduro: వెనిజులా అధ్యక్షుడు మదురో గురించి తెలుసా?
విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో ప్రజా జీవనం అస్తవ్యస్తంగా మారింది. ఆహారం, తాగునీరు, మందులు వంటి నిత్యావసరాల కోసం ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ పరిస్థితులను కారకాస్‌లో నివసిస్తున్న భారతీయుడు సునీల్ మల్హోత్రా మీడియాకు వివరించారు.
ఆహారం కోసం గంటల తరబడి క్యూలు
దాడుల అనంతరం దేశమంతటా భయాందోళన వాతావరణం నెలకొందని సునీల్ తెలిపారు. కరెంట్ లేకపోవడంతో ప్రధాన సూపర్ మార్కెట్లు, పెద్ద దుకాణాలు మూతపడ్డాయి. కొద్దిపాటి చిన్న దుకాణాల ముందు 500–600 మంది వరకు పొడవైన క్యూల్లో గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తోంది. ఫార్మసీల వద్ద కూడా ఇదే పరిస్థితి నెలకొందన్నారు. భయంతో ప్రజలు బయటకు రావడానికే వెనకాడుతుండటంతో అనేక ప్రాంతాలు నిర్మానుష్యంగా మారాయని చెప్పారు.
ఈ దాడుల్లో కారకాస్ అంతర్జాతీయ విమానాశ్రయం, నగరానికి సుమారు 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న దేశంలోనే అతిపెద్ద వైమానిక స్థావరం, అలాగే ఫోర్ట్ ట్యూనా మిలిటరీ బేస్ లక్ష్యంగా మారినట్లు సమాచారం. దాంతో ప్రజా రవాణా పూర్తిగా స్తంభించింది; బస్సులు, ఇతర వాహనాలు నిలిచిపోయాయి.
ఫోన్ ఛార్జింగ్‌కే పోరాటం
విద్యుత్ లేకపోవడంతో కమ్యూనికేషన్ వ్యవస్థ దెబ్బతింది. మొబైల్ ఫోన్లు ఛార్జ్ చేసుకునేందుకు ప్రజలు అవస్థలు పడుతున్నారు. రోడ్లపై ఉన్న కొద్దిపాటి సోలార్ లైట్ల వద్ద ఫోన్లకు ఛార్జింగ్ పెట్టుకునే పరిస్థితి ఏర్పడింది. తానూ ఛార్జింగ్ కోసం చాలా దూరం నడవాల్సి వచ్చిందని సునీల్ చెప్పారు. విద్యుత్ పునరుద్ధరణపై అధికారుల నుంచి స్పష్టత లేకపోవడంతో ప్రజల్లో అనిశ్చితి పెరిగిందన్నారు.
భారతీయుల భద్రతపై ఎంబసీ దృష్టి
వెనెజువెలాలో(Venezuela Crisis) భారతీయుల సంఖ్య తక్కువగా ఉన్నప్పటికీ, భారత రాయబార కార్యాలయం తక్షణమే చర్యలు చేపట్టింది. అక్కడ ఉన్న భారతీయుల కోసం ప్రత్యేక వాట్సప్ గ్రూప్ ఏర్పాటు చేసి, భద్రతా సూచనలు, తాజా సమాచారాన్ని నిరంతరం అందిస్తోంది. ఎంబసీ అధికారులు అందరితో సంప్రదింపులో ఉంటూ ధైర్యం చెబుతున్నారు. సంక్షోభం ఎప్పటికి ముగుస్తుందో తెలియక ప్రజలు ఆందోళనతో గడుపుతున్నారు.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read also: