వెనిజులాలో(Venezuela Crisis) నెలకొన్న తాజా రాజకీయ–సైనిక సంక్షోభం ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా బంగారం, వెండి, ముడి చమురు ధరలపై దీని ప్రభావం ఎక్కువగా ఉండొచ్చని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏయే కమోడిటీల ధరలు పెరిగే అవకాశముందో విశ్లేషకులు పరిశీలిస్తున్నారు.
Read also: America: వెనిజులాపై అమెరికా దాడి.. స్పందించిన భారత్

సంక్షోభ కాలంలో బంగారం, వెండికి డిమాండ్
ప్రపంచవ్యాప్తంగా దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడినప్పుడు, పెట్టుబడిదారులు సురక్షిత పెట్టుబడులైన బంగారం, వెండి వైపు మొగ్గుచూపడం సాధారణమే. గత ఏడాదిలో ట్రంప్ టారిఫ్ విధానాలు, రష్యా–ఉక్రెయిన్ యుద్ధం కారణంగా గోల్డ్ రేట్లు భారీగా పెరిగాయి. 2026 ప్రారంభంలోనే అమెరికా–వెనిజులా మధ్య ఉద్రిక్తతలు మరో కొత్త ముప్పుగా మారాయి.
వెనిజులాపై(Venezuela Crisis) అమెరికా సైనిక చర్యలకు సిద్ధమవుతోందన్న వార్తలు అంతర్జాతీయ మీడియా దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఈ పరిణామాలను ట్రంప్ సోషల్ మీడియా వేదికగా ప్రస్తావించడంతో ప్రపంచవ్యాప్తంగా చర్చ మొదలైంది. వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురో అరెస్ట్ అయ్యారన్న కథనాలు కూడా పరిస్థితిని మరింత ఉద్రిక్తంగా మార్చాయి.
గోల్డ్, వెండి ధరలపై అంచనాలు
ఈ పరిణామాల నేపథ్యంలో వచ్చే వారం బంగారం, వెండి ధరలు గణనీయంగా పెరిగే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. వెండి ధర రూ.2.5 లక్షల వరకు, బంగారం ధర రూ.1.40 లక్షల స్థాయికి చేరవచ్చని అంచనాలు వినిపిస్తున్నాయి.
క్రూడ్ ఆయిల్, పెట్రోల్–డీజిల్ పరిస్థితి
వెనిజులా ప్రపంచంలో చమురు నిల్వలు ఎక్కువగా ఉన్న దేశాల్లో ఒకటి. సంక్షోభం తీవ్రతరం అయితే ముడి చమురు ధరలు బ్యారెల్‌కు 65 డాలర్ల వరకు చేరవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. చమురు ఎగుమతులు నిలిచిపోతే పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగే అవకాశంపై చర్చ సాగుతోంది.
అయితే ప్రస్తుతం వెనిజులా రోజుకు సుమారు 10 లక్షల బ్యారెల్స్ మాత్రమే ఉత్పత్తి చేస్తుండగా, ఎగుమతులు 5 లక్షల బ్యారెల్స్ వరకే పరిమితం అవుతున్నాయి. ఇది ప్రపంచ చమురు ఉత్పత్తిలో చాలా చిన్న వాటా కావడంతో తక్షణంగా ఇంధన ధరలపై పెద్ద ప్రభావం ఉండకపోవచ్చని కొందరు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కానీ సంక్షోభం దీర్ఘకాలం కొనసాగితే మాత్రం పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read also: