हिन्दी | Epaper

USA: హైదరాబాద్ యువతి హత్య కేసు.. మాజీ రూమ్మేటే హంతకుడా?

Tejaswini Y
USA: హైదరాబాద్ యువతి హత్య కేసు.. మాజీ రూమ్మేటే హంతకుడా?

ఆమె ఎన్నో కలలు కన్నది. భవిష్యత్తుపై ఉన్నతమైన ఆశయంతో ఉంది. అందుకు కష్టపడి చదివింది. ఉన్నత విద్యకోసం అమెరికా(USA)కు వెళ్లింది. చక్కగా చదువుకుని, ఉద్యోగాన్ని పొందింది. పనిలో ఆమె నైపుణ్యానికి తగిన గుర్తింపే కాదు.. అందుకు అవార్డులు కూడా పొందింది. కెరీర్ లో ఎంతో సక్సెస్ గా దూసుకెళ్తున్న తరుణంలో ఓ దుర్మార్గుడి వల్ల అనంతలోకానికి వెళ్లింది. ఇటీవల అమెరికాలో హత్యకు గురైన నిఖిత గొడిశాల(27) కేసులో పలు విషయాలు వెలుగుచూస్తున్నాయి. 

Read also: Bangladesh: బంగ్లాలో ఆగని దాడులు.. మరో హిందూ హత్య?

USA
USA: Hyderabad young woman’s murder case.. Is the former roommate the murderer?

బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం..

లాలాగూడ విజయపురి కాలనీకి చెందిన ఆనంద్ కుమార్తె నిఖిత గొడిశాల ఎంఎస్ చదివేందుకు నాలుగేళ్ల కిందట అమెరికాకు వెళ్లారు. మేరీలాండ్ లోని కొలంబియా(Colombia)లో చదువుతూ అక్కడే ఉద్యోగం చేసేవారు. డిసెంబరు 31న కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి న్యూఇయర్ విషెస్ తెలిపారు. అనంతరం ఆమె ఫోన్ కలవలేదు. పోలీసులకు ఫిర్యాదు చేసి, ఇండియాకు వచ్చిన నిందితుడు కాగా నిఖిత కనిపించడం లేదంటూ ఆమె మాజీ రూమ్మేట్ అర్జున్ శర్మ అక్కడి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అనంతరం గుట్టుచప్పుడు కాకుండా ఇండియాకు వచ్చాడు. అనుమానం వచ్చిన పోలీసులు జనవరి 3వ తేదీన అతని అపార్టుమెంట్ లో పరిశీలించగా నిఖిత మృతదేహం కుళ్లిపోయిన స్థితిలో కనిపించింది. ఆమె శరీరంపై కత్తిపోట్లు ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

అయితే డిసెంబరు 31వ తేదీ రాత్రి 7గంటల తర్వాత నిఖితను అర్జున్ శర్మ హత్య చేసి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. వెంటనే అమెరికా పోలీసులు ఇంటర్ పోల్ ద్వారా తమిళనాడు పోలీసులను సంప్రదించగా అతడిని తమిళనాడులో అదుపులోకి తీసుకున్నారు. దీనిపై భారత ప్రభుత్వం స్పందించింది. నిఖిత మృతదేహాన్ని భారత్ కు రప్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు వాషింగ్టన్ లోని భారత రాయబార కార్యాలయం ‘ఎక్స్’ వేదికగా స్పందించింది. కాగా అర్జున్ రెడ్డి నిఖితకు రూమ్మేట్ మాత్రమేనని, బాయ్ ఫ్రెండ్ కాదని ఆమె తండ్రి ఆనంద్ వివరణ ఇచ్చారు.

Read hindi news:hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

రేపు జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో కావూరి అంత్యక్రియలు

రేపు జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో కావూరి అంత్యక్రియలు

ఏప్రిల్ 1 నుంచి HDFC లో భారీ మార్పులు!

ఏప్రిల్ 1 నుంచి HDFC లో భారీ మార్పులు!

భారత్‌కు వస్తున్న నౌకపై దాడి.. ముగ్గురు గల్లంతు

భారత్‌కు వస్తున్న నౌకపై దాడి.. ముగ్గురు గల్లంతు

రాజకీయ నేతల గురించి ఒక్క పదంలో తేల్చేసిన కవిత

రాజకీయ నేతల గురించి ఒక్క పదంలో తేల్చేసిన కవిత

4 ఏళ్ళకే వైవాహిక బంధానికి స్వస్తి పలికిన స్టార్ హీరోయిన్

4 ఏళ్ళకే వైవాహిక బంధానికి స్వస్తి పలికిన స్టార్ హీరోయిన్

టీ20 ర్యాంకింగ్స్‌లో భారత్ జోరు.. టాప్ 2 మనోళ్లే

టీ20 ర్యాంకింగ్స్‌లో భారత్ జోరు.. టాప్ 2 మనోళ్లే

నర్మెట్టాలో ఆయిల్ ఫాం ఫ్యాక్టరీని ప్రారంభించనున్న రేవంత్ రెడ్డి

నర్మెట్టాలో ఆయిల్ ఫాం ఫ్యాక్టరీని ప్రారంభించనున్న రేవంత్ రెడ్డి

ఫుకెట్‌లో ఎయిరిండియా విమానానికి తప్పిన ప్రమాదం

ఫుకెట్‌లో ఎయిరిండియా విమానానికి తప్పిన ప్రమాదం

విద్యుత్ ఛార్జీలు మరింత తగ్గిస్తాం.. సీఎం

విద్యుత్ ఛార్జీలు మరింత తగ్గిస్తాం.. సీఎం

ఇజ్రాయెల్‌పై ఇరాన్ క్షిపణుల వర్షం: దద్దరిల్లిన టెల్ అవీవ్

ఇజ్రాయెల్‌పై ఇరాన్ క్షిపణుల వర్షం: దద్దరిల్లిన టెల్ అవీవ్

రెండు భారీ చిత్రాలతో ‘అల్లు సినిమాస్’ గ్రాండ్ ఓపెనింగ్

రెండు భారీ చిత్రాలతో ‘అల్లు సినిమాస్’ గ్రాండ్ ఓపెనింగ్

స్కూల్స్, కాలేజీల అభివృద్ధికి తమ ఉదారతను చాటుకున్న దంపతులు

స్కూల్స్, కాలేజీల అభివృద్ధికి తమ ఉదారతను చాటుకున్న దంపతులు

📢 For Advertisement Booking: 98481 12870