ఒక సత్యం గడపదాటేసరికి అసత్యం ప్రపంచాన్ని చుట్టేసుకుని వస్తుంది. సత్యం కంటే అసత్యం బలమైంది. కానీ అది తాత్కాలికమే. చివరికి సత్యమే గెలుస్తుంది. భర్తను కోల్పోయి, గుప్పెడు దుఃఖంతో ఉన్న చార్లీ కిర్క్ భార్య ఎరికా కిర్పై సోషల్ మీడియాలో అసత్యవార్తలు హల్ చెల్ చేశాయి. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీవాన్స్ ను ఎరికా కిర్క్ కౌగిలింత ఫొటోలు సోషల్ మీడియాలో ఎంతగా వైరల్ అయిందో అందరికీ తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా విపరీతంగా చక్కర్లు కొట్టింది.
Read Also: AP: బంగాళాఖాతంలో 48 గంటల్లో తుపానుగా మారనున్న అల్పపీడనం

అంతేకాకుండా ఈ ఫొటో పెనుదుమారం రేపింది. సోషల్ మీడియాలో (Social media) జేడీవాన్స్ దంపతులు విడిపోతున్నారంటే తెగ కథనాలు నడిచాయి. క్లారిటీ ఇచ్చిన ఎరికా కిర్క్ టీవీ వ్యాఖ్యాత మేగిన్ కెల్లీతో జరిగిన సంభాషణలో కౌంగిలింతపై ఎరికా కిర్క్ స్పందించారు. ఆ రోజు జేడీ వాన న్ను ఎందుకు కౌగిలించుకోవాల్సి వచ్చిందో స్పష్టత ఇచ్చారు. అక్టోబరు 29న మిస్సిస్సిప్పిలో జరిగిన టర్నింగ్ పాయింట్ యూఎస్ కార్యక్రమంలో వేదికపైకి వస్తుండగా అప్పుడే భావోద్వేగ వీడియో ప్లే అయింది. దీంతో ఒక్కసారిగా ఏడుపు వచ్చేసిందని.. వేదికపై అలా ఏడుస్తూనే ఉన్నట్లు చెప్పింది. ఆ సమయంలో జేడీవాన్స్ (JD vance) తనను చూసి ‘నేను నిన్ను చూసి చాలా గర్వపడుతున్నాను’ అని చెప్పారని..అప్పుడే జేడీ వాన్స్ ను కౌగిలించుకుని ‘దేవుడు నిన్ను దీవించుగాక’ అంటూ తల వెనుక చేసి వేసి దీవించినట్లు చెప్పుకొచ్చారు. తాను ఎవరికైనా కౌగిలించుకుంటే చెప్పే మాట అదేనని క్లారిటీ ఇచ్చారు. అదొక భావోద్వేగ క్షణమే తప్ప అందులో ఏమీ లేదని అన్నారు.
కాల్పుల్లో మరణించిన చార్లీ కిర్క్
చార్లీ కిర్క్ ట్రంప్ కు (Trump) అత్యంత సన్నిహితుడు. టర్నింగ్ పాయింట్ యూఎస్ వ్యవస్థాపకుడు. ఇటీవల దుండగుడు జరిపిన కాల్పుల్లో చార్లీ కిర్క్ మరణించిన విషయం తెలిసిందే. భర్త మరణం తర్వాత టర్నింగ్ పాయింట్ యూఎస్ కార్యక్రమాన్ని భార్య ఎరికా కిర్క్ చేపట్టారు. ఇందులో భాగంగా గత అక్టోబర్ 29న జరిగిన కార్యక్రమానికి జేడీవాన్స్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ వేదికపై జేడీవాన్స్ ను ఎరికా కిర్క్ (erika kirk) గట్టిగా కౌగిలించుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు తెగ వైరల్ అయ్యాయి. దీంతో పుకార్లు షికార్లు చేశాయి. జేడీ వాన్స్ దంపతులు విడిపోతున్నట్లు వార్తలొచ్చాయి. చిన్న విషయాలను పెద్దగా చేసి, వాటిపై తెగ కామెంట్లు చేసేవారు కాస్త ఆలోచించిచేస్తే బాగుంటుంది. ఒక కామెంట్ పెట్టేముందు దాని పర్యవస్థానం ఏవిధంగా ఉంటుందో ఆలోచించి పెట్టాలి.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: