అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ (Donald Trump ) కీలక నిర్ణయం తీసుకున్నారు. దేశ భద్రత, ఉగ్రవాద ముప్పు నుంచి ప్రజలను కాపాడేందుకు అనే పేరుతో 12 దేశాలపై సంపూర్ణ ట్రావెల్ బ్యాన్ (Travel Ban) విధించారు. ఈ ట్రావెల్ బ్యాన్ జాబితాలో అఫ్గానిస్థాన్, మయన్మార్, చాద్, కాంగో, ఈక్వటోరియల్ గినియా, ఎరిట్రియా, హైతీ, ఇరాన్, లిబియా, సోమాలియా, సూడాన్, యెమెన్ దేశాలు ఉన్నాయి. ఈ దేశాల పౌరులు అమెరికాలో ప్రవేశించడానికి అనుమతి లేకుండా చేయాలని నిర్ణయించారు.
దేశాలపై పాక్షికంగా ఆంక్షలు
అలాగే మరికొన్ని దేశాలపై పాక్షికంగా ఆంక్షలు విధించారు. బురుండి, క్యూబా, లావోస్, సియెర్రా లియోన్, టోగో, తుర్కమెనిస్థాన్, వెనెజువెలా దేశాల పౌరులపై కొన్ని రకాల వీసాలపై మాత్రమే నియంత్రణలు విధించనున్నారు. ముఖ్యంగా వీసాల మంజూరు ప్రక్రియపై నియంత్రణలు, విజిట్ మరియు వర్క్ వీసాలకు ఆంక్షలు ఉండే అవకాశం ఉంది. అమెరికాలో శరణార్థుల పేరుతో ప్రవేశిస్తున్న వారిలో భద్రతా ముప్పు ఉన్నవారిని నియంత్రించేందుకు ఈ చర్యలు తీసుకున్నట్టు అధికారికంగా వెల్లడించారు.
ట్రావెల్ బ్యాన్‌పై ప్రపంచవ్యాప్తంగా చర్చ
ఈ ట్రావెల్ బ్యాన్‌పై ప్రపంచవ్యాప్తంగా చర్చ కొనసాగుతోంది. మానవ హక్కుల సంస్థలు, కొన్ని దేశాలు అమెరికా చర్యను విమర్శిస్తున్నప్పటికీ, ట్రంప్ పరిపాలన మాత్రం దేశ భద్రతే తమకు ముఖ్యం అని చెబుతోంది. అమెరికాలో వలసదారులపై ఇప్పటికే కఠినమైన విధానాలు అమలవుతున్న నేపథ్యంలో ఈ ట్రావెల్ బ్యాన్ మరింత తీవ్రతరంగా మారింది. అయితే ఇది అంతర్జాతీయ సంబంధాలపై ఎంత మేర ప్రభావం చూపుతుందో వేచి చూడాలి.
Read Also : Jobs : CISFలో 403 ఉద్యోగాలు.. రేపే లాస్ట్