పదినెలల్లో ఎనిమిది యుద్ధాలను ఆపేశాను’ ఇది అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (trump) వ్యాఖ్యలు. పదేపదే తనను తానే పొగిడేసుకుంటున్న ట్రంప్ వైఖరిపై అధికారులు తలలు పట్టుకుంటున్నారు. భారత్-పాక్ ల యుద్ధాన్ని తానే ఆపేశానని చెప్పారు. దీన్ని భారత్ తీవ్రంగా ఖండించడమే కాక గట్టిగా కౌంటర్ ఇచ్చింది. ఆపరేషన్ సిందూర్ యుద్ధంలో మూడోవ్యక్తి ప్రమేయం లేకుండానే తాము యుద్ధాన్ని ముగించినట్లు ప్రధాని మోడీ, ఇతర నాయకులు వివరణ ఇచ్చారు. అయినా ట్రంప్ తన పంధాను మార్చుకోవడం లేదు. తాను ఎనిమిది యుద్ధాలను ఆపేశానని దీనికి కారణం టారిఫ్ లేనని ట్రంప్ అన్నారు. దేశాన్ని ఉద్దేశించి ట్రంప్ మాట్లాడుతూ ఇంగ్లీష్ భాషలో తనకు అత్యంత ఇష్టమైన పదం ‘టారిఫ్స్’ అని అన్నారు. పదవీ విరమణ చేసిన మాజీ అధ్యక్షుడు జో బైడెన్ తనకు అస్తవ్యస్త పరిస్థితి వదిలి వెళ్లారని తీవ్రంగా విమర్శించారు. ‘నేను అమెరికా బలాన్ని తిరిగి నిలబెట్టాను. పదినెలల్లో ఎనిమిది యుద్ధాలను పరిష్కరించానని, ఇరాన్ అణు ముప్పును తొలగించాను, గాజాలో యుద్ధాన్ని ముగించాను. దాదాపు 3,000 ఏళ్ల తర్వాత తొలిసారిగా అక్కడ శాంతిని తీసుకొచ్చాను. బందీలను స్వదేశానికి తీసుకొచ్చాను’ అని ట్రంప్ అన్నారు. అంతేకాక 2026లో తన ప్రభుత్వ అజెండాను వివరించారు.
Read also: Kash Patel: స్నేహితురాలితో పాడ్ కాస్ట్లో ఎఫ్ బీఐ డైరెక్టర్ .. విమర్శల వెల్లువ

US Tariff
టారిఫ్ వల్లే ఆర్థిక లాభాన్ని పొందాం: ట్రంప్
కెనడా, మెక్సికో, బ్రెజిల్, భారత్ వంటి దేశాలపై తన ప్రభుత్వం విధించిన టారిఫ్ ల వల్లే ఊహించిన దానికంటే చాలా ఎక్కువ డబ్బు సంపాదించామని గొప్పలు చెప్పుకున్నారు. కాగా బైడెన్, అప్పటి ఉపాధ్యాక్షురాలు కమలా హారిస్ హయాంలో ఉన్న అధిక ద్రవ్యోల్బణాన్ని ఆయుధంగా చేసుకుని ట్రంప్ రెండోసారి అధ్యక్ష పదవిని గెలుచుకున్నారు. అయితే అమెరికా ఆర్థిక వ్యవస్థ నిర్వహణపై ట్రంప్ పనితీరును కేవలం 33 శాతం మంది అమెరికన్లు మాత్రమే సమర్థిస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: