US cancels student visas : అమెరికా ప్రభుత్వం 6,000 మందికి పైగా విదేశీ విద్యార్థుల వీసాలను రద్దు చేసింది. ఇందులో ఎక్కువగా భారతీయ విద్యార్థులు ఉన్నారు.
అమెరికా విదేశాంగ శాఖ సమాచారం ప్రకారం, దాదాపు 4,000 వీసాలు చట్ట ఉల్లంఘనల కారణంగా రద్దయ్యాయి. వీటిలో డ్రంక్ అండ్ డ్రైవ్, దొంగతనం, చిన్న నేరాలు ఉన్నాయి. ఇంకా 200–300 వీసాలను టెర్రరిస్ట్ గ్రూపులకు మద్దతు ఇచ్చారన్న కారణంతో రద్దు చేశారు.
ట్రంప్ ప్రభుత్వం కఠినమైన నిబంధనలు అమలు చేస్తోంది.
విద్యార్థుల సోషల్ మీడియా ఖాతాలు, బ్యాక్‌గ్రౌండ్ చెక్‌లు కఠినంగా పరిశీలిస్తున్నారు. దీనివల్ల చాలా మంది విద్యార్థులు, ముఖ్యంగా ఆందోళనల్లో పాల్గొన్న వారు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఈ నిర్ణయంపై అమెరికాలోని ప్రముఖ విశ్వవిద్యాలయాలు కూడా ఆందోళన వ్యక్తం చేశాయి. చిన్న తప్పులకే వీసాలు రద్దు చేయడం సరికాదని అవి పేర్కొన్నాయి. ఈ నిర్ణయం అమెరికాలో చదువుకోవాలనుకునే విదేశీ విద్యార్థుల ఆసక్తిని తగ్గించవచ్చని హెచ్చరించాయి.
Read also :