US seizes oil tanker : అమెరికా మరోసారి సంచలన చర్యకు దిగింది. వెనెజువెలాతో సంబంధాలు ఉన్న రష్యా జెండా కలిగిన ఆయిల్ ట్యాంకర్‌ను అమెరికా స్వాధీనం చేసుకుంది. ‘మారినెరా’ (Marinera) అనే ఆయిల్ ట్యాంకర్‌ను ఉత్తర సముద్రం (నార్త్ సీ)లో రెండు వారాలకుపైగా వెంబడించిన అనంతరం అమెరికా సైన్యం అదుపులోకి తీసుకుంది. ఈ పరిణామం అమెరికా–రష్యా మధ్య ఉద్రిక్తతలను మరింత పెంచే అవకాశం ఉందని అంతర్జాతీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
స్వాధీనం సమయంలో ఆ ట్యాంకర్ రష్యా జెండాతో ప్రయాణిస్తున్నట్లు సమాచారం. అంతేకాకుండా, ఆ నౌకను రక్షించేందుకు రష్యా నౌకాదళానికి చెందిన యుద్ధ నౌకలు కూడా ఆ ప్రాంతంలో ఉన్నట్లు కథనాలు వెల్లడించాయి. దీంతో ఈ ఘటన సముద్రంలో ఉద్రిక్త వాతావరణాన్ని సృష్టించింది.
Read also: Kamareddy Crime: భార్య, బిడ్డలను పోషించలేక తండ్రి ఆత్మహత్య
ఈ ఆపరేషన్‌ను అమెరికా యూరోపియన్ కమాండ్ ధృవీకరించింది. (US seizes oil tanker) అమెరికా విధించిన ఆంక్షలను ఉల్లంఘించినందునే ఈ నౌకను స్వాధీనం చేసుకున్నామని పేర్కొంది. ఈ చర్యలో అమెరికా న్యాయ శాఖ, హోంల్యాండ్ సెక్యూరిటీ శాఖ, రక్షణ శాఖ కలిసి పాల్గొన్నట్లు వెల్లడించింది.
ఆంక్షలు విధించిన నౌకలు పశ్చిమ అర్ధగోళ భద్రతకు ముప్పుగా మారుతున్నాయని, వాటిపై కఠిన చర్యలు తప్పవని అమెరికా స్పష్టం చేసింది. ఈ ఘటన వెనెజువెలా చమురు వ్యాపారం, రష్యా మద్దతు, అమెరికా ఆంక్షల నేపథ్యంలో మరింత ప్రాధాన్యం సంతరించుకుంది.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read also: