ఇరాన్ మీద ముప్పేట దాడులు చేస్తున్న అమెరికా.. నాలుగు రోజుల్లోనే పెద్ద మొత్తంలో మిలిటరీ ఎక్విప్‌మెంట్‌ను కోల్పోయింది. వ్యూహాత్మకంగా దాడులు చేస్తున్న ఇరాన్… తన సమీప దేశాల్లోని అమెరికా సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుంటున్నది. ఈ క్రమంలో ఈ నాలుగు రోజుల వ్యవధిలోనే సుమారు 200 కోట్ల డాలర్ల విలువైన మిలిటరీ ఎక్విప్‌మెంట్ ఇరాన్ (Iran) దాడుల్లో నాశనమైందని అంచనా వేస్తున్నారు. ఖతార్‌లోని అల్ ఉదేయిద్ ఎయిర్ బేస్ వద్ద అమెరికా ఒక ముందస్తు హెచ్చరిక రాడార్ వ్యవస్థను ఏర్పాటు చేసింది. ఈ కేంద్రంలోని ఏఎన్/ఎఫ్‌పీఎస్–132 ఎర్లీ వార్నింగ్ రాడార్ వ్యవస్థపై ఇరాన్ క్షిపణి దాడి చేసిందని ఖతార్ అధికారులు ధృవీకరించారు. ఈ రాడార్ విలువ సుమారు 1.1 బిలియన్ డాలర్లుగా అంచనా వేస్తున్నారు.
Read Also: US Iran Conflict: ఇరాన్ నౌకను ధ్వంసం చేసిన అమెరికా

సుమారు 282 మిలియన్ డాలర్లు ఉంటాయని అంచనా
ఆదివారం కువైట్ వైమానిక రక్షణ వ్యవస్థ.. పొరపాటున అమెరికాకు చెందిన మూడుs ఎఫ్–15 స్ట్రైక్ ఈగిల్ యుద్ధ విమానాలను కూల్చేసినట్టు వార్తలు వచ్చాయి. ఈ ఘటనలో ఆరుగురు పైలట్లు ప్రాణాలతో బయటపడగలిగారు. ఈ మూడు విమానాలు … సుమారు 282 మిలియన్ డాలర్లు ఉంటాయని అంచనా. బహ్రెయిన్‌లో అమెరికా నేవీ బేస్‌పై దాడి మరో దాడిలో బహ్రెయిన్ రాజధాని మనామాలోని అమెరికా నేవీకి చెందిన యునైటెడ్ స్టేట్స్ ఫిఫ్త్ ఫ్లీట్ ప్రధాన కార్యాలయాన్నిలక్ష్యంగా చేసుకున్నట్టు తెలుస్తున్నది. ఈ దాడిలో రెండు కమ్యూనికేషన్ టెర్మినల్స్, పలు భారీ భవంతులు ధ్వంసం అయ్యాయని సమాచారం. వీటిని ఏఎన్/జీఎస్‌సీ–52బీ సాట్‌కామ్ టెర్మినల్స్‌గా గుర్తించారు.
Read Also hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also :