US Denmark talks : గ్రీన్‌ల్యాండ్ అంశంపై పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో అమెరికా, డెన్మార్క్ ప్రభుత్వాలు వచ్చే వారం కీలక చర్చలు జరపనున్నాయి. అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియోతో సమావేశం కావాలని డెన్మార్క్, గ్రీన్‌ల్యాండ్ ప్రభుత్వాలు అభ్యర్థించినట్లు డెన్మార్క్ విదేశాంగ మంత్రి లార్స్ లోక్కే రాస్ముస్సెన్ తెలిపారు. ఈ సమావేశం ద్వారా అపోహలను తొలగించడమే లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.
గ్రీన్‌ల్యాండ్ విదేశాంగ మంత్రి వివియన్ మోట్జ్‌ఫెల్ట్ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ, అమెరికా నుంచి వస్తున్న గట్టైన ప్రకటనలపై స్పష్టత కోరేందుకే ఈ చర్చలు జరుగుతాయని తెలిపారు. గ్రీన్‌ల్యాండ్ విషయంలో అమెరికా వైఖరి కొంత తప్పుగా అర్థం చేసుకున్నదే ఈ పరిస్థితికి కారణమని ఆమె అభిప్రాయపడ్డారు.
Read also: Mohammed Shami: న్యూజిలాండ్ సిరీస్‌కు దూరమైన షమీ..
ఈ అంశంపై యూరప్ దేశాలు కూడా స్పందించాయి. గ్రీన్‌ల్యాండ్, (US Denmark talks) డెన్మార్క్ భౌగోళిక సమగ్రతను గౌరవించాల్సిందేనని యూరోపియన్ నేతలు సంయుక్త ప్రకటన విడుదల చేశారు. అమెరికా ఒత్తిడిని అంగీకరించబోమని వారు స్పష్టం చేశారు.
డెన్మార్క్ ప్రధాని మెట్టే ఫ్రెడరిక్సెన్ మరింత కఠినంగా స్పందిస్తూ, గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా దాడి జరిగితే నాటో కూటమికే ప్రమాదమని హెచ్చరించారు. రెండో ప్రపంచ యుద్ధం తరువాత ఏర్పడిన భద్రతా వ్యవస్థకు ఇది ముగింపు కావచ్చని ఆమె వ్యాఖ్యానించారు.

ఇదిలా ఉండగా, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాత్రం గ్రీన్‌ల్యాండ్‌పై తన వాదనను కొనసాగిస్తున్నారు. ఆర్కటిక్ ప్రాంతంలో చైనా, రష్యా నుంచి వస్తున్న ముప్పులను ఎదుర్కొనేందుకు ప్రపంచంలోనే అతిపెద్ద ద్వీపమైన గ్రీన్‌ల్యాండ్‌పై నియంత్రణ అవసరమని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. అయితే సైనిక చర్యలకంటే కొనుగోలు మార్గాన్నే తమ ప్రభుత్వం అనుసరిస్తుందని మార్కో రూబియో ఎంపీలకు వివరించినట్లు సమాచారం.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: