చైనాలో అమెరికా రాయబారి హనీట్రాప్(Honey Trap) కలకలం రేపింది. ఓ యువతితో ప్రేమాయణం నడుపుతున్న అమెరికా దౌత్యవేత్తపై ట్రంప్ గవర్నమెంట్ యాక్షన్ తీసుకుంది. సదరు రాయబారిని పదవి నుంచి తప్పించింది. తొలగించబడిన దౌత్యవేత్త నిబంధనలను ఉల్లంఘించడమే కాకుండా, చైనా మహిళతో తాను పెట్టుకున్న రిలేషన్‌షిఫ్ గురించి ఉన్నతాధికారులకు తెలియజేయడంలో విఫలమయ్యారని విదేశాంగ శాఖ దర్యాప్తులో తేలింది. ఈ వ్యవహారం జాతీయ భద్రతకు ముప్పు కలిగించే అవకాశం ఉందని భావించిన ట్రంప్ పాలనలోని విదేశాంగ శాఖ, తక్షణమే ఆ దౌత్యవేత్తను పదవి నుంచి తొలగించింది.

Donald Trump: షికాగో మేయర్, ఇల్లినోయా గవర్నర్ పై ట్రంప్ తీవ్ర వ్యాఖ్యలు
చైనా గూఢచార సంస్థలు తరచుగా “హనీపాట్”
భద్రతా కారణాల దృష్ట్యా తొలగించబడిన దౌత్యవేత్త పేరును అధికారులు వెల్లడించలేదు.
అమెరికా ప్రభుత్వం తరఫున చైనాలో పనిచేసే తమ సిబ్బందికి గతంలోనే కీలక హెచ్చరికలు జారీ చేసింది. ఉద్యోగులు, వారి కుటుంబసభ్యులు, సెక్యూరిటీ క్లియరెన్స్ కలిగిన కాంట్రాక్టర్లు ఎవరూ చైనీయులతో శారీరక లేదా ఇతర సంబంధాలు పెట్టుకోకూడదని స్పష్టంగా నిబంధనలు విధించింది. చైనా గూఢచార సంస్థలు తరచుగా “హనీపాట్”(Honey Pot) వ్యూహాలను ఉపయోగిస్తాయని అమెరికా నిఘా వర్గాలు హెచ్చరించాయి. ఇటువంటి నిబంధనల ఉల్లంఘనలను సహించేది లేదని అధికారులు ఈ సందర్భంగా స్పష్టం చేశారు. అయితే, చైనాతో పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో, ట్రంప్ ప్రభుత్వం తీసుకున్న ఈ కఠిన నిర్ణయం దౌత్య వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది.
హనీ ట్రాప్ అంటే ఏమిటో తెలుసా?
ఒక వ్యక్తితో రొమాంటిక్ లేదా లైంగిక సంబంధాలు పెట్టుకోవడం ద్వారా తమకు అవసరమైన సమాచారాన్ని రాబట్టడాన్ని హనీ ట్రాప్ అంటారు. ఇలా హనీ ట్రాప్‌కు పాల్పడే వాళ్లకు ఎక్కువగా అమ్మాయిల పేరుతో, ఫొటోలతో సోషల్ మీడియాలో ఖాతాలు తెరుస్తారు. ఆ తరువాత తామ టార్గెట్ చేసే వ్యక్తులను ఫాలో కావడం ప్రారంభిస్తారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/
Read Also: