Ukraine Drone Attack: నల్లసముద్రంలో ట్యాంకర్‌పై ఉక్రెయిన్ డ్రోన్ దాడి.. 23 మంది భారతీయులు సేఫ్

Follow Us: Google News Daily Hunt
ukraine drone attack black sea oil tanker indian crew safe
ukraine drone attack black sea oil tanker indian crew safe
FONT SIZE
GET APP

Ukraine Drone Attack: ఉక్రెయిన్, రష్యా మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు మరోసారి నల్లసముద్రంలో హింసాత్మక రూపం దాల్చాయి. రష్యాలోని ప్రముఖ పర్యాటక నగరమైన సోచి సమీపంలో లైబీరియా జెండాతో వెళ్తున్న భారీ ఆయిల్ ట్యాంకర్‌పై ఉక్రెయిన్ డ్రోన్లతో విరుచుకుపడింది. ఈ దాడి కారణంగా ట్యాంకర్‌లో భారీ ఎత్తున మంటలు చెలరేగాయి. అయితే, ఈ నౌకలో ఉన్న మొత్తం 23 మంది సిబ్బంది కూడా భారతీయులే కావడం గమనార్హం. వీరి అందరినీ రష్యా రవాణా మంత్రిత్వ శాఖ అధికారులు సురక్షితంగా రక్షించడంతో భారత్‌కు పెద్ద ఊరట లభించింది.

అదుపులోకి రాని మంటలు.. సముద్రంలోకి లీకవుతున్న ముడిచమురు

‘నేవల్ డ్రోన్ల’ ద్వారా ఈ దాడి జరిగిందని రష్యా వర్గాలు వెల్లడించాయి. మంటల తీవ్రత అత్యంత ఎక్కువగా ఉండటంతో అగ్నిమాపక సిబ్బంది సైతం ప్రారంభంలో వాటిని నియంత్రించలేకపోయారు. ట్యాంకర్ నుంచి ముడిచమురు సముద్ర జలాల్లోకి లీకై దట్టమైన మంటలు ఎగిసిపడుతున్నాయి. మంటల తీవ్రత కొద్దిగా తగ్గిన తర్వాత అదార్పు చర్యలు చేపడతామని రష్యా అధికారులు స్పష్టం చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కాగా, సోచి తీరంలో భారీగా నల్లటి పొగలు కమ్ముకున్నాయి. ముందుజాగ్రత్తగా మేయర్ తీర ప్రాంతాలపై ఆంక్షలు విధించారు.

Read also: Viral : నవంబర్ 13న ప్రళయం.. ?

Ukraine Drone Attack: వాణిజ్య నౌకలపై పెరుగుతున్న దాడులు.. పర్యావరణ ముప్పు ఆందోళనలు

రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైన నాటి నుంచి ఇరు దేశాలు నల్లసముద్రంలో వాణిజ్య నౌకలను టార్గెట్ చేయడం పరిపాటిగా మారింది. రొమేనియా తీరంలో నౌక మునిగిపోయి ఒకరు మృతి చెందిన ఘటన జరిగిన మరుసటి రోజే ఈ దాడి జరగడం ఉద్రిక్తతలను మరింత పెంచింది. తమ నగరాలపై రష్యా దాడులకు ప్రతిచర్యగానే చమురు మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుంటున్నామని ఉక్రెయిన్ వాదిస్తోంది. గతంలోనూ ఇలాంటి దాడుల వల్ల చమురు లీకై పర్యావరణానికి తీవ్ర నష్టం వాటిల్లిన నేపథ్యంలో, తాజా ఘటనతో మళ్లీ అలాంటి పర్యావరణ ముప్పు పొంచి ఉందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

Sharanya

రచయిత గురించి

Sharanya

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

మీకు నచ్చవచ్చు