ఫిలిప్పీన్స్ (Philippines) దేశం మరోసారి ప్రకృతి ఆగ్రహానికి గురైంది. కల్మేగీ తుఫాన్ (Kalmaegi Typhoon) ఆ దేశాన్ని వణికిస్తోంది. భారీ వర్షాలు, గాలులు, వరదలతో ఫిలిప్పీన్స్‌లో అనేక ప్రాంతాలు నీట మునిగిపోయాయి. అధికారిక సమాచారం ప్రకారం ఇప్పటి వరకు 224మంది ప్రాణాలు కోల్పోగా, 109మంది గల్లంతయ్యారు. మరణాల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఈ తుఫాను కారణంగా వేలాది మంది గృహాలు కోల్పోయి నిరాశ్రయులయ్యారు.
Read Also: TG Crime: భార్యను బ్యాట్‌తో కొట్టి చంపిన భర్త

వరదలతో విపత్తు పరిస్థితి
ఫిలిప్పీన్స్ (Philippines) సెబూ ఐలాండ్‌లోనే 158మంది మరణించారు. వరదల కారణంగా అనేక గ్రామాలు పూర్తిగా నీటమునిగాయి. రహదారులు, వంతెనలు, విద్యుత్ సరఫరా వ్యవస్థలు దెబ్బతిన్నాయి. 526మంది గాయపడి ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
తుఫాను ప్రభావంతో 700 మందికి పైగా నిరాశ్రయులుగా మారి ప్రభుత్వ సహాయ కేంద్రాల్లో తలదాచుకున్నారు.ఆ దేశంలోని 53 కమ్యూనిటీస్‌లో ఎమర్జెన్సీ కొనసాగుతోంది. ఈ తుఫానును ఆ దేశ ప్రెసిడెంట్ ఫెర్డినాండ్ మార్కోస్ జూనియర్ జాతీయ విపత్తుగా ప్రకటించారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com/
Read Also: