ఒకే ఒక్క టీవీ యాడ్.. డొనాల్డ్ ట్రంప్(Trump)కు తీవ్ర ఆగ్రహం తెప్పించింది. దీంతో ఆ దేశంతో అమెరికా జరుపుతున్న కీలక వాణిజ్య చర్చలు అర్ధాంతరంగా నిలిచిపోయాయి. కెనడాలోని ఒంటారియో ప్రభుత్వం తయారు చేసిన యాడ్‌లో.. టారిఫ్‌లకు వ్యతిరేకంగా అమెరికా మాజీ అధ్యక్షుడికి సంబంధించిన ఆడియో క్లిప్‌లను ఉపయోగించారు. ఆ యాడ్ కాస్తా ట్రంప్ కంట పడటంతో.. ఆ యాడ్ సుంకాలపై అమెరికా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ప్రభావితం చేయాలనే దురుద్దేశంతోనే రూపొందించారని ఆరోపించారు. దీనిపై ఆగ్రహించిన ట్రంప్.. కెనడా మోసపూరితంగా ప్రవర్తించిందంటూ విమర్శిస్తూ చర్చలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.
Read Also: UN: భారత్‌లో జమ్మూ-కాశ్మీర్ అంతర్భాగమే..ఇందులో రాజీలేదు: హరీష్

వాణిజ్య చర్చలు హఠాత్తుగా నిలిపివేసింది
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకునే నిర్ణయాలు ఎవరూ ఊహించని రీతిలో ఉంటాయి. ఇక ఏ దేశమైనా, ఏ వ్యక్తి అయినా ట్రంప్ ఆగ్రహానికి గురైతే పరిణామాలు ఎలా ఉంటాయో ఇప్పటికే చాలాసార్లు చూశాం. తాను అనుకున్నది సాధించేవరకు విడిచిపెట్టని ట్రంప్.. తన లక్ష్యం కోసం ఎలాంటి సంచలన నిర్ణయం తీసుకోవడానికైనా వెనుకాడరు. ఈ క్రమంలోనే తాజాగా తన అసాధారణ నిర్ణయాలతో మరోసారి డొనాల్డ్ ట్రంప్ వార్తల్లో నిలిచారు.
సుంకాలను తగ్గించడంపై రెండు దేశాల మధ్య చర్చలు
కెనడాపై ఇటీవల 35 శాతం నుంచి 50 శాతం వరకు అమెరికా సుంకాలు విధించింది. ఇక ట్రంప్ విధించిన సుంకాలను తగ్గించడంపై రెండు దేశాల మధ్య కొన్ని వారాలుగా వాణిజ్య చర్చలు జరుగుతున్నాయి. ఈ చర్చలు సజావుగా సాగుతున్నాయని.. త్వరలోనే డీల్ కుదురుతుందని కెనడా అధికారులు ఆశతో ఉండగా.. హఠాత్తుగా ఈ పరిణామం చోటు చేసుకుంది. ఈ నెల మొదట్లో కెనడా ప్రధానమంత్రి మార్క్ కార్నీతో డొనాల్డ్ ట్రంప్ ఓవల్ ఆఫీస్‌లో స్నేహపూర్వకంగా సమావేశమైన తర్వాత.. ఈ ఆశలు మరింత పెరిగాయి.
ట్రంప్ ప్రకటనతో షాక్‌లో కెనడా
అయితే.. ఊహించని విధంగా శుక్రవారం ట్రంప్.. ఈ చర్చల రద్దు నిర్ణయాన్ని ప్రకటించడంతో కెనడా షాక్‌లో మునిగిపోయింది. కెనడా దారుణంగా.. మోసపూరితంగా ప్రవర్తించిందంటూ మండిపడ్డారు. ట్రంప్ ఆగ్రహానికి, వాణిజ్య చర్చల రద్దుకు కారణం కెనడాలోని ఒంటారియో ప్రావిన్స్ ప్రభుత్వం రూపొందించిన ఒక టీవీ యాడ్ అని తెలుస్తోంది. ఈ యాడ్‌లో అమెరికా మాజీ అధ్యక్షుడు రొనాల్డ్ రీగన్ సుంకాలపై గతంలో చేసిన పాత ప్రసంగం ఆడియో క్లిప్పులను ఉపయోగించారు. సుంకాలు, ఆంక్షలు దీర్ఘకాలంలో అమెరికన్లకే చేటు చేస్తాయని రొనాల్డ్ రీగన్ పేర్కొన్న ఆడియో క్లిప్‌లు ఈ వాణిజ్య ప్రకటనలో ఉన్నాయి.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: