భారత్, పాకిస్థాన్ (India-pak) మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదరడంలో అమెరికా విజయవంతమైన పాత్ర పోషించిందని ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald trump) మరోసారి వ్యాఖ్యానించగా, కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా స్పందించింది. రెండు దేశాల కాల్పుల విరమణ సమయంలో పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్‌తో ప్రధాని నరేంద్ర మోదీని పోల్చినట్లు కాంగ్రెస్ వ్యాఖ్యానించింది. ఈ మేరకు ట్రంప్ మాట్లాడిన వీడియో క్లిప్‌ను సోషల్ మీడియాలో కాంగ్రెస్ నేత పవన్ ఖేరా పోస్ట్ చేశారు. “అమెరికా అధ్యక్షుడు మళ్లీ ఇలా అన్నారు: ‘నేను భారత్, పాకిస్థాన్ (India-pak) మధ్య ఒప్పందం కుదుర్చుకోవడానికి వాణిజ్యాన్ని ఉపయోగించాను. వారు అంగీకరించారు. ఇద్దరూ గొప్ప నేతలు’ అలా డొనాల్డ్ ట్రంప్ (Donald trump) ప్రధానమంత్రి మోదీని షెహబాజ్ షరీఫ్‌తో పోలుస్తున్నారు” అని పవన్ ఖేరా రాసుకొచ్చారు. అలాంటి పోలిక ప్రధాని మోదీకి ఆమోదయోగ్యమైనదా అని ఆయన ప్రశ్నించారు.

కాంగ్రెస్ పార్టీ మండిపాటు – మోదీ, షెహబాజ్ పోలికపై విమర్శలు
కాంగ్రెస్ డేటా అనలిటిక్స్ ఛైర్మన్ ప్రవీణ్ చక్రవర్తి కూడా స్పందించారు. “‘పాకిస్థాన్ ప్రధాన మంత్రి, భారత ప్రధాన మంత్రి సమానం. పాక్, భారత్ సమాన శక్తులు’ అని అన్నారు. ఎవరు ఇలా అన్నారు? ప్రధాన మంత్రి మోదీ బెస్ట్ ఫ్రెండ్ ట్రంప్” అంటూ ఎద్దేవా చేశారు. సౌదీ అరేబియాలో ట్రంప్ వ్యాఖ్యలను షేర్ చేసిన కాంగ్రెస్ ఎంపీ కార్తీ చిదంబరం, ఈ కథనం సిలబస్‌లో భాగం కాదని వ్యాఖ్యానించారు.
కాల్పుల విరమణ ఒప్పందం – అమెరికా పాత్ర ఎంత?
కాగా, భారత్-పాకిస్థాన్ (India-pak) మధ్య ఉద్రిక్తతలు పెరగకుండా కాల్పుల విరమణ ఒప్పందం కుదరడంలో దేశం కీలక పాత్రను విజయవంతంగా పోషించిందని డొనాల్డ్ ట్రంప్, సౌదీ అరేబియాలోని రియాద్‌లో ఇటీవల మళ్లీ పాత పాట పాడారు. ఇరు దేశాల మధ్య అణు యుద్ధం జరగకుండా అమెరికా నిలువరించిందని పేర్కొన్నారు. శాంతిపరిరక్షకుడిగా, ఐక్యతావాదిగా ఉండాలన్నది ఎప్పుడూ తన ఆశయమని తెలిపారు.
భారత్-పాక్ (India-pak) మధ్య ఒప్పందం కుదిరేందుకు వాణిజ్యాన్ని ఉపకరణంగా వినియోగించానని పేర్కొన్నారు. ఒక ఒప్పందాన్ని కుదుర్చుకుందామని, కొంత వ్యాపారం చేద్దామని ఇద్దరికీ నచ్చజెప్పానని అన్నారు. వారిద్దరూ (భారత్- పాక్ ప్రధానులు) గొప్ప, శక్తిమంతమైన, తెలివైన నేతలుగా వ్యాఖ్యానించారు. అందుకే యుద్ధం నిలిచిపోయిందని అన్నారు. అది అలాగే కొనసాగాలని ఆశిద్దామని తెలిపారు.
Read Also: Retired Jawan Murdered : రిటైర్డ్ జవాన్ దారుణ హత్య