అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) మరోసారి తన వ్యాఖ్యలతో వివాదం రేపారు. ఈసారి ఆయన విమర్శల బాణాలు షికాగో మేయర్ (Mayor of Chicago) బ్రాండన్ జాన్సన్ , ఇల్లినోయా గవర్నర్ జేబీ ప్రిట్జ్కర్ (J.B. Pritzker) పై సంచలన వ్యాఖ్యలు చేసారు,. ఇమ్మిగ్రేషన్ సమస్యల నేపథ్యంలో ట్రంప్ (Donald Trump)చేసిన వ్యాఖ్యలు అమెరికా రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.
Nvidia CEO: విదేశీ ఉద్యోగులకు హెచ్1బీ వీసా స్పాన్సర్ చేస్తాం: ఎన్విడియా సీఈఓ
ఇటీవల ట్రంప్ ప్రభుత్వం అమెరికాలోని పలు రాష్ట్రాల్లో జాతీయ భద్రతా దళాలను మోహరిస్తోంది. అక్రమ వలసదారులపై దాడులు, తనిఖీల నేపథ్యంలో ఈ చర్యలు చేపడుతున్నారు. షికాగోలో ఇమ్మిగ్రేషన్ అధికారుల తనిఖీలకు వ్యతిరేకంగా స్థానికులు నిరసనలు చేస్తుండటంతో,
కేంద్ర బలగాలను అక్కడికి పంపించారు.ఈ చర్యపై ఇల్లినాయి గవర్నర్ జేబీ ఫ్రిట్కర్ తీవ్రంగా స్పందించారు. “డెమోక్రటిక్ పార్టీ పాలనలో ఉన్న రాష్ట్రాల్లో జాతీయ భద్రతా దళాలను మోహరించడం పూర్తిగా అన్యాయం, దారుణం” అని వ్యాఖ్యానించారు.

రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ట్రంప్
రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ట్రంప్ దేశంలోని పలు నగరాలకు కేంద్ర బలగాలను పంపించారు. వాటిలో బాల్టిమోర్, మెంఫిస్, వాషింగ్టన్ డీసీ, న్యూ ఆర్లీన్స్, ఓక్‌లాండ్, శాన్‌ఫ్రాన్సిస్కో, లాస్ ఏంజెలెస్, షికాగో ప్రధానమైనవి.
అయితే, పోర్ట్‌లాండ్ నగరానికి బలగాలను పంపాలన్న నిర్ణయాన్ని ఫెడరల్ కోర్టు నిలిపివేసింది, చిన్నస్థాయి ఆందోళనలను కారణంగా చూపి కేంద్ర బలగాలను పంపడం “అనుచితం” అని వ్యాఖ్యానించింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/
Read Also: