हिन्दी | Epaper

Trump Vs Musk : మస్క్ క్షమాపణలు స్వాగతించిన ట్రంప్ – కరోలిన్

Sudheer
Trump Vs Musk : మస్క్ క్షమాపణలు స్వాగతించిన ట్రంప్ – కరోలిన్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ (Trump Vs Musk) మధ్య జరిగిన వివాదం కొత్త మలుపు తిరిగింది. మస్క్ తన గత వ్యాఖ్యలపై క్షమాపణలు కోరడాన్ని ట్రంప్ స్వాగతించారని అమెరికా వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ (Caroline) వెల్లడించారు. ఆమె ప్రకారం, “ఎలాన్ మస్క్ చేసిన ప్రకటనను అధ్యక్షుడు స్వాగతంగా స్వీకరించారు. ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోంది” అని తెలిపారు.

ప్రస్తుతం ప్రభుత్వ కాంట్రాక్టులపై స్పష్టత లేదు

ఎలాన్ మస్క్ కు ప్రభుత్వం తిరిగి కాంట్రాక్టులు ఇస్తుందా? అనే ప్రశ్నపై స్పందించిన కరోలిన్, ఇప్పటివరకు ఆ దిశగా ఎలాంటి చర్చలు జరగలేదని పేర్కొన్నారు. మస్క్ క్షమాపణ తర్వాత సంబంధాలు మెరుగవుతున్నా, ప్రభుత్వ కాంట్రాక్టుల విషయంలో ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ఆమె స్పష్టం చేశారు. ఇది ట్రంప్–మస్క్ సంబంధాల్లో కొత్త ఒరవడి మొదలైనట్లు అనిపిస్తున్నప్పటికీ, అధికారికంగా సహకారం ప్రారంభమవుతుందా లేదా అనేది మరికొద్దిరోజుల్లో తేలనుంది.

వివాదానికి తెరపడే సూచనలు

మస్క్–ట్రంప్ మధ్య గతంలో ఏర్పడిన వ్యక్తిగత విమర్శలు, వ్యాపారపరమైన విభేదాలు పెద్ద దుమారాన్ని రేపాయి. అయితే తాజాగా క్షమాపణలతో మాటల తూటాలు తగ్గినట్లు కనిపిస్తోంది. మస్క్ ప్రభుత్వం, దేశ ప్రయోజనాల దృష్టిలో పెట్టుకుని ముందడుగు వేస్తున్నట్లు అభిప్రాయపడతున్నారు. ఈ పరిణామాలు అమెరికా రాజకీయాలు, టెక్ పరిశ్రమపై ప్రభావం చూపే అవకాశం ఉందని విశ్లేషకుల అభిప్రాయం.

Read Also : CRS : ఏపీలో జననాలు తగ్గి, మరణాలు పెరుగుతున్నాయ్

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

అమెరికాను వణికిస్తున్న హ్యూమన్ మెటాన్యుమో వైరస్

అమెరికాను వణికిస్తున్న హ్యూమన్ మెటాన్యుమో వైరస్

ఇరాన్ పాఠశాలపై జరిగిన దాడిని ఖండించిన ట్రంప్

ఇరాన్ పాఠశాలపై జరిగిన దాడిని ఖండించిన ట్రంప్

ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ ఎంపిక: వారంలోపే ప్రకటన!

ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ ఎంపిక: వారంలోపే ప్రకటన!

ఇరాన్ హెచ్చరిక: “ట్రంప్ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు!”

ఇరాన్ హెచ్చరిక: “ట్రంప్ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు!”

యుద్ధం.. ఇరాన్‌లో వారం రోజుల్లో 1,300 మంది మృతి

యుద్ధం.. ఇరాన్‌లో వారం రోజుల్లో 1,300 మంది మృతి

గల్ఫ్ దేశాలపై ఇరాన్ క్షిపణి వర్షం: కువైట్, సౌదీలో విధ్వంసం
0:10

గల్ఫ్ దేశాలపై ఇరాన్ క్షిపణి వర్షం: కువైట్, సౌదీలో విధ్వంసం

చమురు ఉత్పత్తిని నిలిపేసిన మరో దేశం!

చమురు ఉత్పత్తిని నిలిపేసిన మరో దేశం!

అంతర్జాతీయ చమురు సంక్షోభం: ఉత్పత్తిని నిలిపివేసిన కువైట్!

అంతర్జాతీయ చమురు సంక్షోభం: ఉత్పత్తిని నిలిపివేసిన కువైట్!

6 నెలల పోరాటానికి సిద్ధమన్న ఇరాన్!

6 నెలల పోరాటానికి సిద్ధమన్న ఇరాన్!

మహిళలకు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన నారా లోకేశ్

మహిళలకు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన నారా లోకేశ్

అంతర్జాతీయ మహిళా దినోత్సవం : స్త్రీ శక్తికి పాదాభివందనం!

అంతర్జాతీయ మహిళా దినోత్సవం : స్త్రీ శక్తికి పాదాభివందనం!

4సార్లు ప్రధానిగా చేసిన ఓలీకి షాక్.. ర్యాపర్ విజయం

4సార్లు ప్రధానిగా చేసిన ఓలీకి షాక్.. ర్యాపర్ విజయం

📢 For Advertisement Booking: 98481 12870