రష్యా, ఉక్రెయిన్ ల యుద్ధం ఆగిపోయేనా? లేదా కొనసాగుతుందా? ఎందుకంటే నేడు (Trump) అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు పుతిన్ ల మధ్య చర్చలు జరగనున్నాయి. దీంతో అందరూ ఈ చర్చలు ఏవిధంగా కొనసాగనున్నాయో అని ఉత్కంఠభరితంగా (Trump) ఎదురుచూస్తున్నారు.
ఈ సందర్భంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు.
అలాస్కా వేదికగా నిర్వహించనున్న సమావేశం అనంతరం ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించేందుకు పుతిన్ ముందుకురాకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీతో పాటు ఇతర ఐరోపా నేతలతో వీడియో కాన్ఫరెన్స్
ద్వారా నిర్వహించిన చర్చల అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. శుక్రవారం నాటి భేటీ సజావుగా సాగితే, ఆ వెంటనే జలెన్ స్కీ ని కూడా కలుపుకొని మరో సమావేశం నిర్వహించే అవకాశం ఉందని చెప్పారు.
శాంతిస్థాపనపై ప్రపంచ నేతలు ఏకతాటిపై ఉన్నారు:
జెలెన్ స్కీకాగా ఉక్రెయిన్లో శాంతిస్థాపన అంశంపై ప్రపంచ నేతలు ఏకతాటిపై ఉన్నారని జెలెన్ స్కీ అన్నారు. ట్రంప్తో చర్చలు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ మొత్తం ఉక్రెఇయన్ ను ఆక్రమించగలనని చూపించే ప్రయత్నంలో భాగంగా సరి హద్దుల్లో యుద్ధాన్ని విస్తరించేందుకు చూస్తున్నారని జెలెన్ స్కీ దుయ్యబట్టారు. ఒకవేళ అంగీకరించని పక్షంలో మరిన్ని ఆంక్షలు విధించాలని విజ్ఞప్తి చేశారు.
Read also :