ఖతార్ లోని హమాస్ నాయకులనే లక్ష్యంగా ఇజ్రాయెల్ చేసిన దాడిపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మండిపడ్డారు. ఖతర్ తమ దేశానికి మిత్రదేశమని, ఆ దేశంపై దాడి చేస్తే సహించేది లేదని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహును ట్రంప్ హెచ్చరించారు(Warned).
అమెరికాకు ఖతార్ మిత్రదేశం: ట్రంప్
మోరిస్టాన్ విమానాశ్రయంలో ట్రంప్ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఇశ్రాయేల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుకు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా అని ప్రశ్నించారు. దీనికి ట్రంప్ సమాధానం చెబుతూ వారు చాలా జాగ్రత్తగా ఉండాలని అన్నారు. తమ దేశానికి కీలక మిత్రదేశంగా ఉన్న ఖతార్ పట్ల జాగ్రత్తగా వ్యవహరించాలని చెబుతూనే ట్రంప్ ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుకు హెచ్చరికలు జారీ చేశారు.

ఖతార్ ప్రధానితో ట్రంప్ విందు
గత కొన్నిరోజుల క్రితం ఖతార్ ప్రధాని షేక్ మహమ్మద్ బిన్ అబ్దుల్ రహమాన్ బిన్ జస్సిమ్ అల్ థానీతో ట్రంప్ విందులో పాల్గొన్నారు. ఆసమయంలోనే ట్రంప్ రహమాన్ బిన్ గొప్ప వ్యక్తిగా అభివర్ణించారు. దేశ ప్రతిష్టను(country’s reputation) మెరుగుపరచుకోవాలని సలహా ఇచ్చినట్లు ట్రంప్ అన్నారు. ఖతార్ గురించి ప్రజలు చాలా బ్యాడ్ గా మాట్లాడుతున్నారని..ఆవిధంగా ఉండకుండా చూసుకోవాలని చెప్పినట్లు ట్రంప్ పేర్కొన్నారు.
తప్పించుకున్న హమాస్ నాయకులు
ఖతార్ రాజధాని దోహాలో జరిగిన ఇజ్రాయెల్ వైమానిక దాడిలో హమాస్ నాయకులు తృటిలో తప్పించుకున్నారు. ఈ దాడిలో ఆరుగురు వ్యక్తులు మరణించారు. ఈ దాడిని ఖతార్ ‘రాజకీయ ఉగ్రవాదం’గా అభివర్ణించింది. ఈ దాడిపై ట్రంప్ ‘ఈ మొత్తం పరిస్థితి పట్ల నాకు ఏ మాత్రం సంతోషంగా లేదు. ఇది మంచి పరిస్థితి కాదు’ అని అన్నారు. బంధీలను తిరిగి తీసుకురావాలని మేం కోరుకుంటున్నామన్నారు. కానీ ఈ దాడి జరిగిన తీరు పట్ల మేం సంతోసంగా లేమని చెప్పుకొచ్చారు.
ట్రంప్ ఎవరిని హెచ్చరించారు?
ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూను.
హెచ్చరికకు కారణం ఏమిటి?
నెతన్యాహూ చర్యలు అమెరికా ప్రయోజనాలకు విరుద్ధంగా ఉన్నాయని ట్రంప్ భావిస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Read also: