Trump India tariffs : రష్యా నుంచి చమురు కొనుగోళ్ల అంశంపై భారత్‌పై మరోసారి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరికలు జారీ చేశారు. ఈ విషయంలో భారత్ సహకరించకపోతే, భారత దిగుమతులపై ప్రస్తుతం ఉన్న టారిఫ్‌లను మరింత పెంచే అవకాశం ఉందని ట్రంప్ స్పష్టం చేశారు. ఈ వ్యాఖ్యలు వెనెజువెలా అధ్యక్షుడు నికోలస్ మదురోను అమెరికా బంధించిన తర్వాత తీసుకునే తదుపరి చర్యలపై మీడియాకు వివరిస్తున్న సమయంలో వచ్చాయి.
మీడియాతో మాట్లాడిన ట్రంప్, భారత ప్రధాని నరేంద్ర మోదీని ప్రస్తావిస్తూ ఆయన “మంచి వ్యక్తి” అని వ్యాఖ్యానించారు. అయితే అమెరికా అధ్యక్షుడిగా తాను సంతోషంగా లేనన్న విషయం మోదీకి తెలుసని, తనను సంతృప్తిపరచాలని భారత్ ప్రయత్నించిందని ట్రంప్ అన్నారు. అవసరమైతే భారత్‌పై టారిఫ్‌లను చాలా వేగంగా పెంచగలమని కూడా ఆయన వ్యాఖ్యానించారు.
రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు (Trump India tariffs) చేయడాన్ని ట్రంప్ ప్రభుత్వం గత కొంతకాలంగా వ్యతిరేకిస్తోంది. ఇదే కారణంగా గత ఏడాది ఆగస్టులో భారత ఉత్పత్తులపై టారిఫ్‌లను 50 శాతానికి పెంచినట్లు ట్రంప్ గుర్తుచేశారు. ఈసారి కూడా రష్యా చమురు అంశంలో సహకారం లేకపోతే మరింత కఠిన నిర్ణయాలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.
Read also: Mohammed Shami: న్యూజిలాండ్ సిరీస్‌కు దూరమైన షమీ..
కొద్ది నెలల క్రితం మోదీ తనకు రష్యా చమురు కొనుగోళ్లు ఆపుతామని హామీ ఇచ్చారని ట్రంప్ పేర్కొన్న సంగతి తెలిసిందే. అయితే అలాంటి చర్చ ఏదీ జరగలేదని భారత్ స్పష్టం చేస్తూ ఆ వ్యాఖ్యలను ఖండించింది. భారత్ తన ఇంధన విధానాలు మార్కెట్ అవసరాలు, వినియోగదారుల అవసరాల ఆధారంగానే నిర్ణయిస్తుందని పదే పదే వెల్లడించింది.
భారత్–అమెరికా మధ్య వాణిజ్య చర్చలు కొనసాగుతున్న ఈ సమయంలో ట్రంప్ తాజా వ్యాఖ్యలు ద్వైపాక్షిక సంబంధాల్లో మరోసారి ఉద్రిక్తతలకు దారి తీసే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. రష్యా నుంచి చమురు సరఫరాలో భారత్‌కు ప్రధాన దేశంగా ఉండటం, అదే సమయంలో ఉక్రెయిన్ యుద్ధానికి ఆ ఆదాయం ఉపయోగపడుతోందన్న ఆరోపణలు అమెరికా నుంచి రావడం ఈ వివాదానికి కారణంగా మారాయి.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: