Trump-అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాను అనుకున్నవిధంగానే భారతదేశంపై భారీ సుంకాలను విధించారు. ఇటీవల భారతదేశం చైనా, రష్యాలతో స్నేహసంబంధాలను పెంచుకుంటూ ఉండడం ట్రంప్ కు గిట్టని వ్యవహారంగా మారింది. తమను కాదని వేరేదేశాలతో సంబంధాలను మెరుగుపరచుకోవడం గిట్టని ట్రంప్ మరింత భారాన్ని మోపుతున్నారు. ఇందులో భాగంగా రష్యా-ఉక్రెయిన్ యుద్ధం(Russia-Ukraine war) ఇంకా కొనసాగుతూనే ఉందని, రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు చేస్తోందనే కారణంగా ట్రంప్ 25 శాతం నుంచి 50శాతానికి సుంకాలను విధించారు. అంతేకాక భారత్, చైనాతో పాటు ఆయా దేశాల దిగుమతులపై వందశాతం సుంకాలు విధించాలని యూరోపియన్ యూనియన్ (ఇయూ) దేశాలను కోరినట్లు తెలుస్తోంది.

అధికారులతో భేటీ అయిన ట్రంప్
వాషింగ్టన్ లో సీనియర్ అమెరికన్, యూరోపియన్ యూనియన్ అధికారులు (European Union officials) రష్యాపై ఆంక్షలు విధించే అంశంపై భేటీ అయ్యారు. ఈయూ అధికారులతో ట్రంప్ కాన్ఫరేన్స్ కాల్లో మాట్లాడారు. రష్యా మరింత ఆర్థిక ఒత్తిడిని తీసుకొచ్చేందుకు భారత్, చైనాపై వందశాతం సుంకం విధించాలని వారికి సూచించినట్లు సమాచారం. ఆ దేశాలు రష్యా నుంచి చమురు కొనుగోలు చేయడాన్ని ఆపేస్తామని చెప్పేవరకు ఈ సుంకాలు కొనసాగించాలని కోరారు.
ట్రంప్ సూచనలు అమలుకు సిద్ధమన్న యూరోపియన్ యూనియన్
ట్రంప్ చెప్పిన వందశాతం టారిఫ్(Tariff) లను విధించేందుకు సిద్ధమవుతున్న వేళ, ఆయన సూచనలు అమలు చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని యూరోపియన్ యూనియన్ అధికారులు పేర్కొన్నారు. భారతదేశంపై నిత్యం ఆరోపణలు చేస్తున్న ట్రంప్ రష్యా నుంచి అధిక చమురు కొనుగోలు చేస్తున్ననాటి నుంచి ఇండియాపై కక్షకట్టినట్లుగా వ్యవహరిస్తున్నారు. భారత్ నిర్ణయం వల్లే రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కొనసాగుతున్నదని నిందలు మోపుతున్నారు. అధిక సుంకాలతో ఇండియాపై బెదిరింపు చర్యలకు పాల్పడుతున్నారు. అయినా కూడా భారత్ ఎక్కడా వెనుకంజ వేయలేదు. తమదేశ ప్రయోజనాల కోసం ఎంత నష్టాలను అయినా భరిస్తామని కేంద్రం తేల్చిచెప్పింది.
ట్రంప్ భారత్‌పై ఎంత సుంకం విధించారు?
ట్రంప్ భారత్‌పై వందశాతం సుంకం విధించారు.
ఈ సుంకాల వల్ల ఎలాంటి రంగాలు ఎక్కువగా ప్రభావితం అవుతాయి?
ఉక్కు, అల్యూమినియం, టెక్స్టైల్, వ్యవసాయ ఉత్పత్తులు ప్రధానంగా ప్రభావితం అవుతాయి.
Read hindi news:hindi.vaartha.com
Read Also: