Trump-గత కొంతకాలంగా భారతదేశంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాలతో పలు బెదిరింపులకు పాల్పడుతున్నారు. రష్యా నుంచి భారత్ అధిక చమురు కొనుగోలు చేయడంపై మండిపడ్డ ట్రంప్ భారత్ పై 50శాతం టారిఫ్లను విధించారు. తర్వాత వందశాతం సుంకాలు విధిస్తామని హెచ్చరించారు. ట్రంప్ బెదిరింపులకు భారత్ ఏమాత్రం చలించలేదు. తమ దేశ ప్రయోజనాలే ముఖ్యమని తేల్చి చెప్పింది. అంతేకాక చైనా దేశాన్ని పర్యటించిన మోదీ,
రష్యా అధ్యక్షుడు పుతిన్, చైనా అధ్యక్షుడు జిన్పింగ్ లతో భేటీ అయ్యారు. వీరితో పాటు ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ కూడా ఉన్నారు. దీంతో ట్రంప్ వీరి కలయికలపై పలు కామెంట్లు కూడా చేశారు. భారత్ తో తమ స్నేహసంబంధాలు మెరుగుపడతాయని పేర్కొన్నారు. త్వరలో మళ్లీ పూర్వస్నేహసంబంధాలను కొనసాగిస్తామని అమెరికా విదేశీవ్యవహారాల మంత్రి రూబియో (Rubio) ఇటీవల చెప్పిన విషయం విధితమే.

భారత్ లో జరగనున్న క్వాడ్ దేశాధినేతల సదస్సుకు ట్రంప్ హాజరు?
భారతదేశంలో జరగనున్న క్వాడ్ దేశాధినేతల సదస్సుకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా హాజరయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం చైనా నుంచి భారత్ దూరం చేయడమే తమముందున్న కర్తవ్యమని ఇటీవల భారత్ కు నియమితులైన అమెరికా రాయబారి సెర్గియె గోర్(Sergey Gor)పేర్కొన్నారు. ఇండియాలో క్వాడ్ దేశాధినేతల సదస్సుకు ట్రంప్ హాజరవుతారని సెర్గియో గోర్ చెప్పారు. అయితే దీనికి సంబంధించిన ఇప్పటి వరకు ఖచ్చితమైన తేదీ ఖరారు కాలేదు. గత ఫిబ్రవరిలో మోదీ అమెరికా పర్యటన సందర్భంగా పై సమావేశాలకు హాజరుకావాలని ట్రంపు ఆహ్వానించిన విషయం తెలిసిందే.
డొనాల్డ్ ట్రంప్ ఎప్పుడు భారత్‌కి రానున్నారు?
ఖచ్చితమైన తేదీలు ఫైనల్ అయినా, అధికారిక ప్రకటన త్వరలో వెలువడుతుంది.
ఈ పర్యటన ప్రధాన ఉద్దేశ్యం ఏమిటి?
అమెరికా-భారత్ మధ్య వ్యాపార, రాజకీయ మరియు ఆర్థిక అంశాలపై చర్చలు జరగనున్నాయి.
Read hindi news: hindi.vaartha.com
Read also: