అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Trump) టారిఫ్‌ల విధానంపై కీలక వ్యాఖ్యలు చేశారు.తాజాగా ట్రంప్ మాట్లాడుతూ, అమెరికాకు సుమారు $600 బిలియన్ డాలర్ల కంటే ఎక్కువ మొత్తంలో సుంకాలు వస్తాయని తెలిపారు. ఈ సుంకాల వల్ల దేశ భద్రత, ఆర్థిక వ్యవస్థ రెండూ చాలా బలంగా మారాయని ఆయన ప్రకటించారు. “మన దేశానికి 600 బిలియన్ డాలర్ల కంటే ఎక్కువ సుంకాలు వచ్చాయి, ఇంకా రాబోతున్నాయి. కానీ ఫేక్ న్యూస్ మీడియా దీని గురించి మాట్లాడదు.
Read also: Nicolas Maduro : అమెరికా కోర్టులో మదురో: ‘నేను నిర్దోషిని’ | వెనెజువెలా సంక్షోభం
భారత ఉత్పత్తులపై 50 శాతం టారిఫ్
ఎందుకంటే వాళ్లకు మన దేశం అంటే ద్వేషం. మనపై వారికి గౌరవం లేదు” అని మండిపడ్డారు. “ఈ మీడియా సంస్థలు రాబోయే సుప్రీంకోర్టు తీర్పును ప్రభావితం చేయాలని చూస్తున్నారు. ఇది చాలా ముఖ్యమైన తీర్పు” అని ట్రంప్ (Trump) తన ట్రూత్ సోషల్ పోస్ట్‌లో పేర్కొన్నారు. సుంకాల వల్ల అమెరికా ఆర్థికంగా, జాతీయ భద్రత విషయంలో ఎప్పుడూ లేనంత బలంగా, గౌరవంగా మారిందని ఆయన తెలిపారు.2025 జనవరిలో అధికారంలోకి వచ్చిన వెంటనే ట్రంప్, ఆయన బృందం టారిఫ్‌లను జాతీయ భద్రత, విదేశాంగ విధాన సాధనంగా ఉపయోగించడం ప్రారంభించడం తెలిసిందే.

ఈ క్రమంలోనే ప్రపంచంలోని పలు దేశాల నుంచి దిగుమతి అయ్యే ఉత్పత్తులపై భారీ సుంకాలు విధించారు. ముఖ్యంగా భారత ఉత్పత్తులపై 50 శాతం టారిఫ్ విధించారు.భారత్‌కు అమెరికా అతిపెద్ద ఎగుమతి మార్కెట్ గా ఉంది. మన దేశ మొత్తం వస్తు ఎగుమతుల్లో దాదాపు 18 శాతం అమెరికాకే వెళుతున్నాయి. గార్మెంట్స్, లెదర్ ఉత్పత్తులు వంటివి ఇందులో ప్రధానమైనవి. అయితే, వ్యవసాయం, డెయిరీ వంటి సున్నితమైన రంగాల్లో అమెరికా ఉత్పత్తులకు ద్వారాలు తెరిచే విషయంలో భారత్ దృఢమైన వైఖరితో ఉండటంతో ఇరు దేశాల మధ్య వాణిజ్య ఒప్పందం కుదరడంపై సందేహాలున్నాయి.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read also: