డొనాల్డ్ ట్రంప్ (Donald trump) విధించిన సుంకాలపై అమెరికా సుప్రీంకోర్టులో జరుగుతున్న విచారణలు ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక నిపుణుల దృష్టిని ఆకరిస్తున్నాయి. ఈ కేసులో ట్రంప్ పరిపాలన వాదనలకు అనుకూలంగా నడుస్తుందని భావించినప్పటికీ, ఆయన నియమించిన న్యాయమూర్తులు కూడా కఠిన ప్రశ్నలతో ప్రభుత్వ న్యాయవాదులను నిలదీశారు. దీంతో ఈ కేసు ఫలితం అనిశ్చితగా మారింది. ట్రంప్ 1977 నాటి ఇంటర్నేషనల్ ఎమర్జెన్సీ ఎకనామిక్ పవర్స్ యాక్ట్ (ఐఈఈపిఎ) ఆధారంగా అనేక దేశాలపై సుంకాలను విధించారు. ఆయన వాదన ప్రకారం..అమెరికా అత్యవసర ఆర్థిక పరిస్థితిలో ఉందని, అందుకే వాణిజ్య నియంత్రణ చర్యలు తీసుకోవాల్సి వచ్చిందని అన్నారు. అయితే అనేక దిగువ కోర్టులు ఈ నిర్ణయాన్ని చట్టపరంగా సవాలు చేసి నిలిపివేశాయి. ఇప్పుడు సుప్రీంకోర్టు ఆదే అంశంపై తుది తీర్పు ఇవ్వబోతోంది.
Read also: Jairam Ramesh: ట్రంప్ వ్యాఖ్యలు .. మోడీ మౌనంపై కాంగ్రెస్ విమర్శలు
దిగ్గజాలు భారీ లాభాలు పొందవచ్చు.

Trump: ట్రంప్ సుంకాలపై తుదితీర్పు ఇవ్వనున్న సుప్రీంకోర్టు
ఆర్థిక నిపుణుల హెచ్చరికలు.. ట్రంప్ ప్రభుత్వం సుప్రీంకోర్టు (supreme court) లో ఓడిపోతే.. అమెరికా ఇప్పటికే సుంకాల రూపంలో సేకరించిన 72 బిలియన్ డాలర్ల (రూ.6.38 లక్షల కోట్లు) మొత్తాన్ని తిరిగి చెల్లించాల్సిన పరిస్థితి వస్తుంది. విచారణ ఆలస్యం అయితే ఈ మొత్తం 750 బిలియన్ డాలర్ల నుంచి 1 ట్రిలియన్ డాలర్ల (రూ. 66 నుంచి 88 లక్షల కోట్లు) వరకు పెరిగే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ రీఫండ్ లతో వంటి దిగుమతి, రిటైల్ దిగ్గజాలు భారీ లాభాలు పొందవచ్చు. వినియోగదారులకూ కూడా నేరుగా ప్రయోజనం కలుగుతుంది. ఎందుకంటే అధిక ధరలు చెల్లించిన వారు కంపెనీలపై క్లాస్ యాక్షన్ కేసులు వేసే అవకాశం ఉంది. ఇప్పటికే కొంతమంది దిగుమతిదారులు తమ సంభావ్య రీఫండ్ హక్కులను కొనుగోలుచేసేందుకు పందేలు కడుతున్నట్లు నివేదికలు చెబుతున్నాయి.
ట్రంప్ తనవంతుగా
వాణిజ్య విధానం, ప్రపంచ మార్కెట్లపై ప్రభావం ట్రంప్ తనవంతుగా అమెరికా సుంకాలను ఎత్తివేస్తే మూడవ ప్రపంచ దేశంగా మారుతుందని హెచ్చరించారు. అయితే న్యాయనిపుణుల మాటల్లో, ఈ కేసు ఫలితం అమెరికా న్యాయ చట్టాల భవిష్యత్తు రూపును నిర్ణయించనుంది. సుప్రీంకోర్టు తీర్పు 2025 చివరి లేదా 2026 మధ్యలో వెలువడే అవకాశం ఉంది. తీర్పు వచ్చేవరకు దిగుమతిదారులు, కంపెనీలు తమ సుంకాల రికార్డులను సురక్షితంగా ఉంచాలని నిపుణులు సూచిస్తున్నారు. ట్రంప్ ఈ కేసులో ఓడిపోతే అది కేవలం ఒక న్యాయ పరాజయం మాత్రమే కాదు.. అమెరికా ఆర్థిక వ్యవస్థ, వాణిజ్య విధానం, ప్రపంచ మార్కెట్లపై దూరప్రభావాలు చూపే చారిత్రక సంఘటనగా నిలుస్తుంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com/
Read Also: