అమెరికా న్యాయ శాఖ ఫెడరల్ రిజర్వ్‌పై క్రిమినల్ నేరారోపణలతో బెదిరించడం.. అదే సమయంలో ఇరాన్‌లో తీవ్రతరం అవుతున్న నిరసనలు ప్రపంచ మార్కెట్లలో భౌగోళిక రాజకీయ ఆందోళనలు ఒక్కసారిగా పెంచాయి. దీంతో అంతర్జాతీయంగా Gold ధరలు చరిత్రలోనే గరిష్ట స్థాయికి చేరాయి. సురక్షిత పెట్టుబడిగా భావించే బంగారంపై పెట్టుబడిదారుల డిమాండ్ ఒక్కసారిగా పెరగడంతో విలువైన లోహాలు భారీ పెరుగుదలతో దూసుకుపోయాయి. ఫెడరల్ రిజర్వ్ చైర్మన్ జెరోమ్ పావెల్ జూన్ నెలలో ఫెడ్ ప్రధాన కార్యాలయ పునరుద్ధరణ వ్యయాలపై కాంగ్రెస్ ముందు ఇచ్చిన వాంగ్మూలానికి సంబంధించి అమెరికా న్యాయ శాఖ నుంచి గ్రాండ్ జ్యూరీ సమన్లు అందాయని సోమవారం వెల్లడించారు. ఈ పరిణామం అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Trump) – పావెల్ మధ్య ఇప్పటికే ఉన్న ఉద్రిక్తతను మరింతగా పెంచింది. అంతేకాదు, అమెరికా కేంద్ర బ్యాంకు స్వతంత్రతపై మార్కెట్లలో కొత్త ఆందోళనలకు దారి తీసింది.ఈ నేపథ్యంలో బులియన్ ధరలు ఒక్కసారిగా పెరిగి ఔన్సుకు 4,600 డాలర్ల స్థాయిని తాకాయి. కేంద్ర బ్యాంకుపై రాజకీయ జోక్యం పెరుగుతోందన్న భయం పెట్టుబడిదారులను సురక్షిత ఆస్తుల వైపు మళ్లించింది.
Read Also: USMilitary: ఇరాన్‌పై మిలిటరీ యాక్షన్.. ట్రంప్‌కు అధికారుల బ్రీఫింగ్!

ఇరాన్‌లో నిరసనలు బంగారం పెరుగుదలకు మరో ప్రధాన కారణం
ఇదే సమయంలో ఇరాన్‌లో చెలరేగిన ఘోర నిరసనలు బంగారం పెరుగుదలకు మరో ప్రధాన కారణంగా మారాయి. ఇస్లామిక్ రిపబ్లిక్ పాలన కూలిపోయే అవకాశాలపై చర్చలు పెరగడంతో మధ్యప్రాచ్య రాజకీయాలు మరింత అస్థిరంగా మారాయి. ఇది చమురు మార్కెట్లతో పాటు ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై కూడా ప్రభావం చూపే పరిస్థితిని సృష్టించింది. ఈ పరిణామాల మధ్య.. వెనిజులా నాయకుడు నికోలస్ మదురోను స్వాధీనం చేసుకున్న ఘటన తర్వాత.. గ్రీన్‌ల్యాండ్‌ను స్వాధీనం చేసుకుంటామని ట్రంప్ బెదిరింపులకు దిగారు. అంతేకాదు, నాటో కూటమి ప్రాధాన్యతను ప్రశ్నిస్తూ, ఇరాన్‌పై అమెరికా అవసరమైతే తీసుకునే చర్యల జాబితాను సిద్ధం చేసుకోవడాన్ని పరిశీలిస్తున్నామని ఆయన వ్యాఖ్యానించారు. ఇవన్నీ కలిపి మార్కెట్లలో అనిశ్చితిని మరింత పెంచాయి. సింగపూర్‌కు చెందిన సాక్సో మార్కెట్స్ వ్యూహకర్త చారు చనానా మాట్లాడుతూ…భౌగోళిక రాజకీయాలు, వృద్ధి-వడ్డీ రేట్ల చర్చలు, ఇప్పుడు సంస్థాగత రిస్క్ ప్రీమియంలు అన్నీ కలసి మార్కెట్లలో అనిశ్చితి ఎంత ఎక్కువగా ఉందో ఇది గుర్తుచేస్తోందని వ్యాఖ్యానించారు. గత ఏడాది కాలంగా బంగారం ధరలను మద్దతు ఇచ్చిన దాదాపు అన్ని ప్రతికూల పరిస్థితులు ఇప్పుడు ఒకేసారి కనిపిస్తున్నాయి. వడ్డీ రేట్లు తగ్గే అంచనాలు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, అమెరికా డాలర్‌పై నమ్మకం తగ్గడం అన్నీ కలిసి బంగారాన్ని మరింత ఆకర్షణీయంగా మార్చాయి.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: