గాజా(Gaza)లో సుమారు రెండేళ్లుగా కొనసాగుతున్న సంఘర్షణను ముగించేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump)ఓ సమగ్ర శాంతి ప్రణాళికను ప్రకటించారు. ఈ ప్రణాళికను ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమిన్ నెతన్యాహు(Benjamin Netanyahu) కూడా అంగీకరించినట్లు వైట్ హౌస్ వెల్లడించింది. ఈ శాంతి ప్రణాళిక ద్వారా గాజాలో యుద్ధాన్ని ముగించి పునర్మిర్మాణం చేపట్టాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
శాంతి ప్రణాళికకు 8 దేశాల మద్దతు డొనాల్డ్ ట్రంప్ రూపొందించిన ఈ శాంతి ప్రణాళికకు మొత్తం 8 అరబ్, ముస్లిం దేశాలు తమ సమ్మతిని తెలిపాయి. ఈ దేశాల్లో ఖతార్, జోర్డాన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఇండోనేషియా, పాకిస్తాన్, టర్కీ, సౌదీ అరేబియా, ఈజిప్ట్ ఉన్నాయి. ఈ దేశాల విదేశాంగ మంత్రులు ట్రంప్ నాయకత్వాన్ని, శాంతి ప్రయత్నాలను స్వాగతించారు. ఈ ప్రణాళిక గాజాలో తక్షణ కాల్పుల విరమణకు, పునర్నిర్మాణానికి , పాలస్తీనా పౌరుల స్థానభ్రంశాన్ని అరికట్టడానికి, శాశ్వత శాంతికి దోహదపడుతుందని వారు ప్రశంసించారు.

హమాస్ తిరస్కరిస్తే ఏం జరుగుతుంది?
హమాస్ (Hamas) కనుక శాంతి ప్రతిపాదనను అంగీకరిస్తే, యుద్ధం తక్షణమే ముగుస్తుందని డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. ఇజ్రాయెల్ సైన్యం గాజా నుంచి వెనక్కి తగ్గుతుందని.. అన్ని సైనిక కార్యకలాపాలు నిలిపివేయబడతాయన్నారు. అరబ్, ముస్లిం దేశాలు కూడా ఈ ప్రక్రియలో సహకరిస్తాయి. ఒకవేళ హమాస్ ఈ శాంతి ప్రణాళికను తిరస్కరిస్తే, హమాస్‌ను పూర్తిగా నాశనం చేయడానికి ఇజ్రాయెల్‌కు అమెరికా మద్దతు ఇస్తుంది. ఇజ్రాయెల్ సైన్యంతో కలిసి అమెరికా సైన్యం కూడా ఈ పనిని పూర్తి చేస్తుందని ట్రంప్ స్పష్టం చేశారు. శాంతి ప్రణాళికలోని ముఖ్యాంశాలు ట్రంప్ ప్రకటించిన 21 సూత్రాల శాంతి ప్రణాళికకు అంగీకరించేందుకు హమాస్‌కు 72 గంటల సమయం ఉంది.
గాజాలో మానవీయ సాయం
ఇరు పక్షాలు సంతకం చేయగానే తక్షణమే సీజ్‌ఫైర్ ప్రకటిస్తారు. గాజా తాత్కాలిక పాలనా బాధ్యతలను టెక్నోక్రాటిక్ పాలస్తీనా కమిటీకి అప్పగిస్తారు. దీనిని అధ్యక్షుడు ట్రంప్, మాజీ బ్రిటిష్ ప్రధాని టోనీ బ్లెయిర్ నేతృత్వంలోని అంతర్జాతీయ బోర్డ్ ఆఫ్ పీస్ పర్యవేక్షిస్తుంది. గాజాను పునరుద్ధరించడానికి, పాలస్తీనా, ప్రపంచ నిపుణులతో కూడిన కొత్త గవర్నింగ్ అథారిటీని ఏర్పాటు చేస్తారు. పాలస్తీనియన్ పౌరులను గాజాను విడిచి వెళ్లవలసిందిగా నిర్బంధించడం జరగదు. ఇజ్రాయెల్ 72 గంటల్లోగా బంధీలుగా ఉన్న అందరినీ (బతికున్న లేదా మరణించిన) అప్పగిస్తుంది.
ఇజ్రాయెల్ 250 మంది జీవిత ఖైదీలను, 1700 మంది గాజా పౌరులను విడుదల చేస్తుంది. ఆయుధాలు విడిచిపెట్టి, శాంతికి హామీ ఇచ్చే హమాస్ సభ్యులకు క్షమాభిక్ష లభిస్తుంది, వారు సురక్షితంగా బయటకు వెళ్లడానికి అవకాశం కల్పిస్తారు. గాజాలో మానవీయ సాయం, మౌలిక సదుపాయాలు, ఆసుపత్రులు, రహదారుల పునర్నిర్మాణం కోసం అంతర్జాతీయ సంస్థల సహాయంతో సహాయ సామగ్రిని అందిస్తారు.
Poll not found.
గాజా ఎందుకు అంత ప్రసిద్ధి చెందింది?
గాజా, a పురాతన కాలం నుండి గాజా ఒక సంపన్నమైన ఒయాసిస్ మరియు వాణిజ్య కేంద్రంగా ఉందని చరిత్ర వెల్లడిస్తుంది, ఇది ఏ మధ్యప్రాచ్య సామ్రాజ్యమైనా ఈజిప్టును జయించటానికి మరియు నైలు లోయ ఆధారిత శక్తి అయినా లెవాంట్‌పై దాడి చేయడానికి ఒక ఆధారంలా పనిచేసింది.
గాజా మరియు ఇజ్రాయెల్ ఒకే దేశమా?
అధికారికంగా పాలస్తీనా రాష్ట్రం అని పిలువబడే పాలస్తీనా పశ్చిమ ఆసియాలోని ఒక దేశం. UN యొక్క 193 సభ్య దేశాలలో 157 దేశాలచే గుర్తించబడిన ఇది తూర్పు జెరూసలేంతో సహా ఇజ్రాయెల్ ఆక్రమిత వెస్ట్ బ్యాంక్ మరియు సమిష్టిగా పాలస్తీనా భూభాగాలుగా పిలువబడే గాజా స్ట్రిప్‌ను కలిగి ఉంది.
Read hindi news: hindi.vaartha.com
Read Also: