हिन्दी | Epaper
పెరగనున్న వాహనాల ధరలు మైనర్ బాలిక ప్రసవం ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం బిహార్ సీఎం రేసులో ఇద్దరు భారత్ స్థావరాలను అమెరికా వాడుతోందని కల్తీ నెయ్యి కుంభకోణం ట్రంప్ కు బిగ్ షాక్ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు ఫ్యామిలీ కార్డు’ డ్రై ఫ్రూట్స్ ధరలకు రెక్కలు రాశి ఫలాలు పెరగనున్న వాహనాల ధరలు మైనర్ బాలిక ప్రసవం ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం బిహార్ సీఎం రేసులో ఇద్దరు భారత్ స్థావరాలను అమెరికా వాడుతోందని కల్తీ నెయ్యి కుంభకోణం ట్రంప్ కు బిగ్ షాక్ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు ఫ్యామిలీ కార్డు’ డ్రై ఫ్రూట్స్ ధరలకు రెక్కలు రాశి ఫలాలు పెరగనున్న వాహనాల ధరలు మైనర్ బాలిక ప్రసవం ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం బిహార్ సీఎం రేసులో ఇద్దరు భారత్ స్థావరాలను అమెరికా వాడుతోందని కల్తీ నెయ్యి కుంభకోణం ట్రంప్ కు బిగ్ షాక్ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు ఫ్యామిలీ కార్డు’ డ్రై ఫ్రూట్స్ ధరలకు రెక్కలు రాశి ఫలాలు పెరగనున్న వాహనాల ధరలు మైనర్ బాలిక ప్రసవం ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం బిహార్ సీఎం రేసులో ఇద్దరు భారత్ స్థావరాలను అమెరికా వాడుతోందని కల్తీ నెయ్యి కుంభకోణం ట్రంప్ కు బిగ్ షాక్ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు ఫ్యామిలీ కార్డు’ డ్రై ఫ్రూట్స్ ధరలకు రెక్కలు రాశి ఫలాలు

US: ఇరాన్​పై యుద్ధంలో స్టార్మర్​ కలిసిరాకపోవడంపై ట్రంప్ ఫైర్​

Vanipushpa
US: ఇరాన్​పై యుద్ధంలో స్టార్మర్​ కలిసిరాకపోవడంపై ట్రంప్ ఫైర్​

ఇరాన్​పై అమెరికా జరుపుతున్న దాడుల్లో బ్రిటన్ భాగస్వామి కాకపోవడంపై యూఎస్​ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Trump) తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ తమ దేశంలోని ముస్లిం ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకే ఈ నిర్ణయం తీసుకున్నారని ఆరోపించారు. సోమవారం (యూఎస్ కాలమానం ప్రకారం) బ్రిటన్​కు చెందిన ఓ ప్రముఖ వార్తాపత్రికకు ఇచ్చిన టెలిఫోనిక్ ఇంటర్వ్యూలో ట్రంప్ ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. “బ్రిటన్ ఇకపై గుర్తించదగిన దేశం కాదు. ప్రధాని స్టార్మర్​ ముస్లిం ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు పాకులాడుతున్నారు. ఆయన మాకు ఏ మాత్రం సహకరించలేదు. బ్రిటన్​ నుంచి మాకు ఇలాంటి పరిస్థితి ఎదురవుతుందని నేను ఎప్పుడూ ఊహించలేదు. మేము బ్రిటన్​ను చాలా ప్రేమిస్తాం. కానీ ఇలా జరుగుతుందని అనుకోలేదు.”

Read Also: War Updates: యూఎస్-ఇజ్రాయిల్ దాడులు.. ఇరాన్‌లో 787 మంది మృతి

Trump fires back at Starmer for not joining war on Iran
Trump fires back at Starmer for not joining war on Iran

బ్రిటన్ ప్రధాని రాజకీయ కారణాలతో ముస్లిం ఓటర్ల కోసం ప్రాకులాడుతున్నారా? అని విలేకరి ప్రశ్నించగా, “అది నిజం కావచ్చు” అని ట్రంప్ సమాధానం ఇచ్చారు.

బ్రిటన్ ప్రభుత్వ దీర్ఘకాలిక విధానం

వాస్తవానికి ఇంతకు ముందు బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్​ హౌస్​ ఆఫ్ కామన్స్​లో పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధవాతావరణంపై మాట్లాడారు. “ఇరాన్​పై అమెరికా, ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో యునైటెడ్ కింగ్​డమ్ పాల్గొనలేదు. ఇది కావాలనే తీసుకున్న నిర్ణయం. పశ్చిమాసియాలో శాంతి నెలకొనాలంటే, చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవడం ఒక్కటే మార్గమని నేను భావిస్తున్నాను. అలాగే ఇరాన్ తన అణ్వస్త్ర ఆకాంక్షలను విరమించుకోవాలి. అలాగే పశ్చిమాసియాలో అస్థిరతకు కారణమయ్యే కార్యకలాపాలన్నింటినీ ఇరాన్ ఆపేయాలని మేము కోరుకుంటున్నాం. ఇది బ్రిటన్ ప్రభుత్వ దీర్ఘకాలిక విధానం” అని కీర్ స్టార్మర్​ అన్నారు. అలాగే ట్రంప్ చేసిన విమర్శలపై స్టార్మర్ స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870