అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌పై(Microsoft) తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆ సంస్థలో గ్లోబల్ అఫైర్స్ హెడ్‌గా ఉన్న లీసా మొనాకోను వెంటనే తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు. ఆమెను “అవినీతిపరురాలు”గా అభివర్ణిస్తూ, “అమెరికా జాతీయ భద్రతకు పెద్ద ముప్పు” అని ఆరోపించారు.
Read also: Telugu News: Chandra Babu: ఏపీలో రోడ్ల వృద్ధి కి రూ.4,500 కోట్లు కేటాయించిన ప్రభుత్వం

సోషల్ మీడియాలో ట్రంప్ ఆరోపణలు
ట్రంప్ తన సోషల్ మీడియా వేదిక ట్రూత్ సోషల్లో పోస్టు చేస్తూ, మైక్రోసాఫ్ట్ ప్రభుత్వ కాంట్రాక్టులు పొందుతున్న సంస్థ కాబట్టి, లీసాకు సున్నితమైన సమాచారం చేరే అవకాశం ఉందని, అందువల్ల ఆమెను నమ్మరానిదని పేర్కొన్నారు. అంతేకాకుండా, ఆమెకు ఉన్న భద్రతా అనుమతులను రద్దు చేసి, ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రవేశాన్ని నిషేధించినట్లు వెల్లడించారు.
లీసా మొనాకో గత బాధ్యతలు
ఈ ఏడాది మేలో మైక్రోసాఫ్ట్‌లో చేరకముందు, లీసా మొనాకో జో బైడెన్ ప్రభుత్వంలో 39వ డిప్యూటీ అటార్నీ జనరల్‌గా పనిచేశారు. అటార్నీ జనరల్ మెరిక్ గార్లాండ్ కింద ఆమె కీలక బాధ్యతలు నిర్వహించారు. బైడెన్ ప్రభుత్వంలో(Biden administration) పనిచేసిన అనుభవమే ట్రంప్ అసంతృప్తికి కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు.
హెచ్1బీ వీసాల వివాదం నేపథ్యంలో ప్రాధాన్యం
ఇటీవల ట్రంప్ ప్రభుత్వం హెచ్1బీ వీసాలపై భారీ ఫీజు విధించిన తర్వాత, మైక్రోసాఫ్ట్ సహా పలు టెక్ కంపెనీలు అసహనం వ్యక్తం చేశాయి. ఈ నెల 21 నుంచి అమల్లోకి రానున్న కొత్త నిబంధనల వల్ల, విదేశాల్లో పనిచేస్తున్న ఉద్యోగులను తక్షణమే వెనక్కి రమ్మని మైక్రోసాఫ్ట్ సూచించింది. ఈ పరిణామాల నడుమ ట్రంప్ వ్యాఖ్యలు మరింత ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
ట్రంప్ ఎవరిపై ఆరోపణలు చేశారు?
మైక్రోసాఫ్ట్ గ్లోబల్ అఫైర్స్ హెడ్ లీసా మొనాకోపై.
ట్రంప్ ఎందుకు లీసా మొనాకోను తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు?
ఆమెను అవినీతిపరురాలు, జాతీయ భద్రతకు ముప్పు అని పేర్కొన్నారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also: