అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) మరో ముఖ్యమైన నిర్ణయం తీసుకున్నారు. దేశంలో పెరుగుతున్న ఆహార ధరలను అదుపులోకి తెచ్చేందుకు,పలు ఆహార ఉత్పత్తుల దిగుమతులపై విధించిన సుంకాలను తొలగించారు. ఈ నిర్ణయం భారతదేశానికి చెందిన మామిడి, దానిమ్మలు, టీ వంటి వ్యవసాయ ఎగుమతులకు భారీ ప్రయోజనం చేకూర్చనుంది.శుక్రవారం వైట్‌హౌస్ విడుదల చేసిన ఫ్యాక్ట్‌షీట్ ప్రకారం ట్రాపికల్ పండ్లు, పండ్ల రసాలు, టీ, కాఫీ,
Read Also: Bosnia: బోస్నియాలో పేదల్ని హతమార్చిన సంపన్నులు
సుగంధ ద్రవ్యాలు, కోకో, నారింజ, టమోటాలు, బీఫ్ వంటి వాటిపై విధించిన సుంకాలను తొలగించారు. భారత్‌తో పాటు ఇతర దేశాల నుంచి దిగుమతులపై ట్రంప్ 25 శాతం సుంకాలు విధించడంతో పాటు, రష్యా (Russia) నుంచి చమురు కొనుగోలు చేస్తున్నందుకు అదనంగా మరో 25 శాతం భారం మోపిన విషయం తెలిసిందే.
ఈ సుంకాల కారణంగా అమెరికాలో కొన్ని ఆహార ఉత్పత్తుల ధరలు పెరిగిపోయాయి.ఇటీవల న్యూయార్క్, న్యూజెర్సీ, వర్జీనియాలో జరిగిన ఎన్నికల్లో సరసమైన ధరల అంశాన్ని డెమొక్రాట్లు బలంగా ప్రచారం చేసి విజయాలు సాధించారు. పెరుగుతున్న ధరల వల్ల ఓటర్లు ఎదుర్కొంటున్న ఇబ్బందులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మారాయి.

ఆర్థిక వ్యవస్థ విషయంలో ట్రంప్ విఫలమయ్యారని
ఎన్‌బీసీ న్యూస్ పోల్ ప్రకారం 63 శాతం మంది ఓటర్లు ధరల నియంత్రణ, ఆర్థిక వ్యవస్థ విషయంలో ట్రంప్ (Donald Trump) విఫలమయ్యారని అభిప్రాయపడ్డారు.అయితే, ఈ ఆరోపణలను ట్రంప్ కొట్టిపారేశారు.
ఇది డెమొక్రాట్లు చేస్తున్న ‘కంప్లీట్ కాన్ జాబ్’ (పూర్తి మోసం) అని, బైడెన్ హయాంలో ద్రవ్యోల్బణం 19.7 శాతానికి చేరిందని గుర్తుచేశారు. ప్రస్తుతం ద్రవ్యోల్బణం 3 శాతం వద్ద ఉన్నప్పటికీ, కొన్ని ఆహార ఉత్పత్తుల ధరలు అధికంగానే ఉన్నాయి.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com/
Read Also: