Donald Trump : రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ నివాసాన్ని లక్ష్యంగా చేసుకుని ఉక్రెయిన్ భారీ డ్రోన్ దాడికి యత్నించిందన్న వార్తలు అంతర్జాతీయంగా కలకలం రేపుతున్నాయి. ఈ అంశంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం ఫ్లోరిడాలోని మార్-ఎ-లాగోలో ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో భేటీకి ముందు ట్రంప్ మీడియాతో మాట్లాడారు.
పుతిన్ స్వయంగా తనకు ఫోన్ చేసి ఈ డ్రోన్ దాడి విషయాన్ని తెలిపారని ట్రంప్ వెల్లడించారు. “ఈ రోజు ఉదయాన్నే పుతిన్ నాకు ఫోన్ చేశారు. తన నివాసాన్ని లక్ష్యంగా ఉక్రెయిన్ డ్రోన్లతో దాడి చేసిందని చెప్పారు. ఇది చాలా ప్రమాదకరం. నాకు ఇది అస్సలు నచ్చలేదు, చాలా కోపం వచ్చింది,” అని ట్రంప్ వ్యాఖ్యానించారు. అయితే, ఈ సమాచారం పూర్తిగా నిజమై ఉండకపోవచ్చన్న సందేహాన్ని కూడా ఆయన వ్యక్తం చేశారు.
Read Also: TG: ఈరోజు నుంచి అందుబాటులోకి టెట్ హాల్ టికెట్లు
రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్‌రోవ్ తెలిపిన వివరాల (Donald Trump) ప్రకారం, డిసెంబర్ 28, 29 తేదీల్లో మాస్కోకు పశ్చిమాన ఉన్న నోవ్‌గోరోడ్ ప్రాంతంలోని పుతిన్ నివాసంపై ఉక్రెయిన్ 91 లాంగ్‌రేంజ్ డ్రోన్లతో దాడికి ప్రయత్నించింది. అయితే రష్యా గగనతల రక్షణ వ్యవస్థలు అన్ని డ్రోన్లను కూల్చివేశాయని ఆయన పేర్కొన్నారు.
ఈ ఆరోపణలను ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్‌స్కీ తీవ్రంగా ఖండించారు. రష్యా చెబుతున్నవి పచ్చి అబద్ధాలని ఆయన వ్యాఖ్యానించారు. ఇరువైపుల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నప్పటికీ, పుతిన్‌తో తన చర్చలు సానుకూలంగా సాగాయని ట్రంప్ తెలిపారు. ఇటీవల 24 గంటల వ్యవధిలో రెండుసార్లు పుతిన్‌తో మాట్లాడినట్లు చెప్పారు.
ఇదిలా ఉండగా, జెలెన్‌స్కీతో కూడా భేటీ అయిన ట్రంప్, రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించే ఒప్పందానికి తాము చాలా దగ్గరగా ఉన్నామని పేర్కొన్నారు. అయితే అదే సమయంలో, జపోరిజ్జియా ప్రాంతంపై పూర్తి నియంత్రణ సాధించేందుకు పుతిన్ తన సైన్యానికి ఆదేశాలు జారీ చేయడం పరిస్థితిని మరింత ఉద్రిక్తంగా మార్చింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: