అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ , రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ (Trump – Putin meet ) మరోసారి భేటీకి సిద్ధమవుతున్నారు. హంగరీ లోని బుడాపెస్ట్‌ను ఈ భేటీకి వేదికగా నిర్ణయించారు. అయితే ఈ సమావేశం వాయిదా పడనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు అమెరికా మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. ఇరుదేశాల అధ్యక్షుల సమావేశానికి ముందు అమెరికా, రష్యా విదేశాంగ మంత్రులు మార్కో రూబియో, సెర్గీ లావ్రోవ్‌ల మధ్య సమావేశం జరగాల్సి ఉంది. అయితే ఇది నిరవధికంగా (Trump – Putin meet) వాయిదా పడిందని వైట్‌హౌస్ వర్గాలు తెలిపాయి. అధ్యక్షుల సమావేశానికి సంబంధించి ఏర్పాట్లలో భాగంగా నిర్మాణాత్మక చర్చలు జరిపేందుకుగాను వీరు భేటీ కావాల్సి ఉందని రష్యా తెలిపింది. ఈ సమావేశం నిలిచిపోవడానికి గల కారణాలు స్పష్టంగా తెలియలేదు. ఈ క్రమంలోనే రూబియో, లావ్రోవ్‌లు సోమవారం ఫోన్‌లో మాట్లాడుకున్నారు. యుద్ధానికి శాశ్వత పరిష్కారం ఇచ్చేందుకు.. రష్యా, అమెరికాల మధ్య సహకారానికి సంబంధించి ఈ భేటీ ప్రాముఖ్యతను రూబియో చెప్పినట్లు స్టేట్ డిపార్ట్‌మెంట్ తెలిపింది.
Read Also: http://Trump’s Warning to Hamas: హమాస్ కు ట్రంప్ వార్నింగ్

అయితే ఉక్రెయిన్ వివాదం శాంతియుతంగా పరిష్కరించే విషయంపై వీరి మధ్య బేధాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దాంతో ట్రంప్-పుతిన్‌ల వచ్చేవారం భేటీకి సంబంధించి సిఫార్సు చేసేందుకు రూబియో అయిష్టంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇరుదేశాల మంత్రులు ఈ వారంలో మళ్లీ మాట్లాడుకునే అవకాశం ఉందన్నారు. ఈ ఫోన్ కాల్‌పై క్రెమ్లిన్ స్పందించింది. ట్రంప్, పుతిన్‌ల భేటీకి సంబంధించి ఇరుదేశాల మంత్రుల మధ్య నిర్మాణాత్మకమైన చర్చలు జరిగాయని పేర్కొంది. ఉక్రెయిన్‌లో శాంతి నెలకొల్పే అంశంపై ట్రంప్ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ అవి ఫలించడం లేదు. ఇప్పటికే ఇరుదేశాధినేతలతో ట్రంప్ మాట్లాడినప్పటికీ ఏ ప్రయోజనం లేకుండా పోయింది. ఈ క్రమంలోనే ఇటీవల పుతిన్‌తో ట్రంప్ ఫోన్ కాల్‌లో మాట్లాడారు. ఆ సమయంలోనే హంగరీలో మరోసారి భేటీ అవ్వాలని ఇరువురు నేతలు నిర్ణయించుకున్నారు. ఈ సంభాషణ జరిగిన మరుసటి రోజే ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీతో ట్రంప్ వైట్‌హౌస్‌లో సమావేశమయ్యారు. జెలెన్‌స్కీతో చర్చలు సానుకూలంగా జరిగాయని తెలిపారు.
ట్రంప్ మరియు పుతిన్ మధ్య సంబంధం ఏమిటి?
GQ మ్యాగజైన్‌లో పీటర్ కాన్రాడి ఈ సంబంధాన్ని “బ్రోమాన్స్”గా అభివర్ణించారు. 2013 మరియు 2015 మధ్య, ట్రంప్ “నాకు పుతిన్‌తో సంబంధం ఉంది”, “నేను అతనిని ఒకసారి కలిశాను” మరియు “నేను అధ్యక్షుడు పుతిన్‌తో పరోక్షంగా మరియు ప్రత్యక్షంగా మాట్లాడాను, అతను ఇంతకంటే మంచిగా ఉండకపోవచ్చు” అని పేర్కొన్నాడు. 2016 నుండి, తన ఎన్నికల ప్రచారంలో, అతని వైఖరి మారిపోయింది.
ట్రంప్ మరియు పుతిన్ 2018 లో ఎందుకు కలిశారు?
ఈ శిఖరాగ్ర సమావేశం అధ్యక్ష భవనంలో జరిగింది మరియు 2017లో జరిగిన G20 హాంబర్గ్ మరియు APEC వియత్నాం శిఖరాగ్ర సమావేశాలలో ట్రంప్ మరియు పుతిన్ మధ్య జరిగిన అనధికారిక చర్చల తర్వాత నాయకుల మధ్య జరిగిన మొదటి అధికారిక సమావేశం ఇది. ఈ శిఖరాగ్ర సమావేశంలో చర్చించనున్నట్లు ట్రంప్ ప్రకటించిన అంశాలలో సిరియా మరియు ఉక్రెయిన్ పరిస్థితులు ఉన్నాయి.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: