Trump Outsourcing Ban : అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మళ్లీ భారతీయుల ఉద్యోగాలపై బాంబు పేల్చబోతున్నారని వార్తలు వస్తున్నాయి. అమెరికన్ ఫార్ రైట్ కార్యకర్త లారా లూమర్ చేసిన సోషల్ మీడియా పోస్ట్ ప్రకారం, ట్రంప్ అమెరికా ఐటీ కంపెనీలు తమ పనులను భారతీయ కంపెనీలకు అవుట్‌సోర్స్ చేయకుండా ఆపే దిశగా ఆలోచిస్తున్నారని తెలిపారు. (Trump Outsourcing Ban) అంతేకాకుండా, కాల్ సెంటర్లను మళ్లీ అమెరికాలోనే ప్రారంభించాలన్న నినాదాన్ని కూడా ప్రస్తావించారు.
ఈ నిర్ణయం అమల్లోకి వస్తే, భారతీయ ఐటీ రంగం తీవ్ర ప్రభావాన్ని ఎదుర్కొనే అవకాశం ఉంది. ఎందుకంటే అమెరికన్ కంపెనీల నుంచి వచ్చే కాంట్రాక్టుల వల్లే లక్షలాది ఉద్యోగాలు భారతదేశంలో ఏర్పడుతున్నాయి.
ముఖ్యంగా సాఫ్ట్‌వేర్ అభివృద్ధి, కస్టమర్ కేర్, బ్యాక్‌ఎండ్ సపోర్ట్ రంగాలు పెద్ద దెబ్బతినే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
లారా లూమర్ వ్యాఖ్యలతో పాటు, మరో అమెరికన్ కార్యకర్త జాక్ పోసోబిక్ కూడా స్పందించారు. ఆయన అభిప్రాయం ప్రకారం, విదేశీ రిమోట్ ఉద్యోగులపై అమెరికా సుంకాలు విధించాలి అని, ఇతర దేశాలు అమెరికాకు సేవలు ఇవ్వాలంటే ప్రత్యేక ఫీజు చెల్లించాలన్నారు.
వైట్ హౌస్ మాజీ వాణిజ్య సలహాదారు పీటర్ నవారో కూడా దీనికి మద్దతు తెలిపారు. ఆయన మాటల్లో.. భారతదేశానికి అవుట్‌సోర్సింగ్ చేయడం వలన అమెరికన్ కార్మికుల వేతనాలు, ఉపాధి తగ్గిపోతున్నాయి అన్నారు.
ఈ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో పెద్ద చర్చ మొదలైంది. కొందరు అమెరికన్లు “అవుట్‌సోర్సింగ్ ఆగిపోతే ఉద్యోగాలు అమెరికాలో పెరగవు, కంపెనీలు నేరుగా భారతదేశంలోనే అభివృద్ధి కేంద్రాలను పెంచుతాయి” అని అభిప్రాయపడ్డారు. ఇంకొందరు మాత్రం “ఇది చాలా కాలంగా జరగాల్సిన పని.
అమెరికా ఐటీ ఉద్యోగాలు అమెరికన్లకే రావాలి” అని సమర్థించారు. కొందరు అమెరికన్ నెటిజన్లు “భారతదేశం ఇకపై అమెరికాకు మిత్రదేశం కాదు” అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేయగా, మరికొందరు “చౌకైన శ్రామికుల వల్ల కంపెనీలు భారత్‌లో మరిన్ని కేంద్రాలు ఏర్పాటు చేస్తాయి కానీ చివరికి నష్టమయ్యేది అమెరికాకే” అని అన్నారు.
Read also :