మానవాళి మనుగడకే పెను విపత్కర వైపరీత్యాలతో యావత్ప్రపంచాన్ని మృత్యుపాశావరణంగా విలయం వైపు నడిపిస్తున్న భూతాపాన్ని నియంత్రించే తక్షణ చర్యగా కర్బన ఉద్గారాలను క్షీణింప చేయాలని, ఐక్యరాజ్య సమితి హెచ్చరిస్తోంది. బొగ్గు, చమురు వంటి భూగర్భ నిక్షేపా లను, ఇంధనాలుగా మండించటం వలన కార్బన్ డై ఆక్సైడ్ తదితర ఉద్గారాల వలన భూతాపం పెరిగి, ప్రపంచ మానవాళి విధ్వంసం, మృత్యు సంక్షోభాన్ని ఎదు ర్కొంటోంది. 2016 ప్యారిస్ ఒప్పందం, వాతావరణ ఉష్ణోగ్రతలు పారిశ్రామిక విప్లవం ముందు ఉన్న స్థాయి కన్నా, రెండు డిగ్రీల సెంటీగ్రేడు మించకుండా నియంత్రించాలని, రెండు దశాబ్దాల క్రితం నుంచి పర్యావరణ శాస్త్రజ్ఞులు హెచ్చరికకు అను కూలంగా తీర్మానించింది. కాని ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Trump)అమెరికా ఫస్ట్’ అంటూ కొత్త నినాదం తలకెక్కించుకుని 195 దేశాలు ఆమోదించిన ప్యారిస్ ఒప్పందానికి తూట్లు పొడిచాడు. పారిశ్రామిక యుగం ఆవిర్భావం తర్వాత, అగ్ర సంపన్న రాజ్యాలైన అమెరికా, చైనాలు అగ్రస్థాయిలో కర్బన కాలు ష్యం సృష్టి స్తూ, పర్యావరణ విధ్వంస కారకులుగా ప్రపం చాన్ని మృత్యు సంక్షోభం వైపు నెట్టేసాయి. డొనాల్డ్ ట్రంప్ (Trump) ఆమెరికా అధ్యక్షుడు అయిన మరు క్షణంలో అమెరికా ప్యారిస్ ఒప్పందం నుంచి వైదొలగింది. కర్బన్ ఉద్గారాల తగ్గింపు చర్యలు తీవ్ర విఘాతం ఎదురొకంటున్నాయి. ట్రంప్ ప్రభుత్వం బొగ్గు, చమురు వంటి శిలాజ ఇంధనాల వినియోగంపై దృష్టి సారించింది. నిస్సిగ్గుగా అగ్గి రాజేసి, భూమిని తాపాన్ని మరింత పెంచి, అగ్నిగుండం చేయా లని అధ్యక్షుడు ట్రంప్ కార్యాచరణ ప్రారంభించాడు. భూతాపం పెరగడం ఉత్తుత్తి భ్రమగా కొట్టిపారేసాడు.
Read Also: America: US Fed వడ్డీ రేట్లు తగ్గింపు.. భారత మార్కెట్లపై ప్రభావం!

‘డ్రిల్ బేబీ డ్రిల్’
గ్లోబల్ వార్మింగ్ ఒక తమాషా అన్నాడు. ‘మనకున్నది ఒక్కటే భూమి’ అన్న స్పృహ లేకుండా వ్యవహరిస్తున్నాడు. బొగ్గు వంటి శిలాజ ఇంధనాలు మరింతగా కొల్లగొట్ట డానికి ‘డ్రిల్ బేబీ డ్రిల్’ డ్రిలింగ్ గాండ్రింపు మొదలెట్టాడు. ప్యారిస్ ఒప్పం దం అమెరికాఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తోం దని, దాన్ని చించిపారేయాలన్నాడు. చైనా ఎటువంటి శిక్ష లేకుండా తప్పించుకొంటుంటే అమెరికా తన పరిశ్రమలను ధ్వంసం చేసుకోలేదని ఆక్రోశం, ఆగ్రహం వెళ్లగక్కాడు. ప్రపంచంలో అతిపెద్ద ముడి చమురు దేశంగా అమెరికా 2023లో రికార్డు సాధించింది. 2022లోనే లిక్వి ఫైడ్ నేచురల్ గ్యాస్ అతిపెద్ద ఎగుమతి సాధించిన, అగ్రరాజ్యంగా గుర్తింపు పొందింది. 2025లో మళ్లీ దేశాధ్యక్షుడైన ట్రంప్ ‘డ్రిల్ల్ బేబీ డ్రిల్ల్ నినాద లక్ష్యం ముడిచమురు, గ్యాస్, బొగ్గు మరింతగా త్రవ్వి వెలికితీసే, భూతాపాన్ని పెంచే మానవాళి విలయానికి ప్రోత్సాహం అందిస్తోంది. వాతావ రణ సమతుల్యానికి విఘాతం కలిగిస్తున్న కర్బన ఉద్గారాల ను నియంత్రించడానికి ఇప్పటికే అభివృద్ధి పథంలో ఉన్న, సంపన్న దేశాలు, వర్ధమాన దేశాలకు యేటా 10వేల కోట్ల డాలర్ల హరిత నిధి ఏర్పాటు అంశం, పారిశ్రామిక అగ్రదేశా లు కచ్చితమైన భరోసా ఇవ్వకుండా, దశాబ్దంపైగా ముఖం చాటేస్తున్నాయి. ఐక్యరాజ్యసమితి 2050 నాటికి అభివృద్ధి చెందిన ప్రపంచం ఫండింగ్, టెక్నాలజీ, తదితర అంశాలకు యేటా వాతారణ దుష్పరిణామాల నివారణకు 500 బిలి యన్ డాలర్లు వినియోగించవలసి ఉంటుందని 2015లో స్పష్టం చేసింది. 2025 నాటికి, పర్యావరణ విధ్వంసానికి తెగబడి బొగ్గు పులుసు వాయు ఉద్గారాల అగ్గిరాజేస్తున్న ట్రంప్ బొగ్గు వంటి శిలాజ ఇంధనాల వినియోగానికి నిస్సి గ్గుగా మళ్లీ తెరలేపాడు.
అమెరికా ఫస్ట్
పూర్వాధ్యక్షుడు ఒబామా 2014లో 26-28 శాతంకాలుష్య వాయువుల నియంత్రణకు ఉద్దేశిం చిన కార్యా చరణ ప్రణాళికకు ట్రంప్ రావడంతోనే మంగ ళం పాడాడు. భూమి సురక్షితంగా మనుగడ సాగించాలం టే, ప్రమాదకర వాయు ఉద్గారాలను కట్టడి చేయాలని ఐరాస ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న ప్రపంచ దేశాల సదస్సులు, శాస్త్రజ్ఞు లు ఎంత మొత్తుకొంటున్నా, ట్రంప్ పారిస్ ఒప్పందాన్ని తోసిపుచ్చడమే కాక, 2040 నాటికి అమెరికా మూడు లక్షల కోట్ల డాలర్ల దేశీయోత్పత్తిని, 65 లక్షల పారిశ్రామిక ఉద్యోగాలను, ప్రతీ కుటుంబం కనీసంగా 7000 డాలర్ల ఆదాయాన్ని కోల్పోవలసి వస్తుందని గత 8 సంవత్సరాలుగా బొగ్గు, ఇతర శిలాజ ఇంధనాలకు రాచ బాటపరిచే అడ్డగోలు, వాదన కొనసాగిస్తున్నాడు. పర్యా వరణ పరిరక్షణ కోసం అన్ని త్యాగాలు అమెరికానే చేయా లా అంటూ చిందులు తొక్కు తున్నాడు. 2025 నాటికి 27 లక్షల ఉద్యోగాలకు ఎసరుపెట్టే పారిస్ పర్యావరణ ఒప్పం దం అమెరికా ప్రయోజనాలను దోచి పెడ్తోందని అసత్య ప్రచారంతో అమెరికా ఫస్ట్’ సంకుచిత నినాదం లేవదీసి మళ్లీ అధ్యక్షడు కాగలిగాడు.

విశ్వాసంలేకపోవడం
పర్యావరణాన్ని రాజకీయ చదరంగం లో పావుగా మార్చేసిన ట్రంప్ పోకడ, అమెరికాను పెడస రపు అగ్రరాజ్యాంగా శిలాజ ఇంధనాల విచ్చలవిడి వినియో గానికి పాల్పడుతోంది. ఈ సంవత్సరం నవంబరు నెలా ఖరులో బ్రెజిల్, బెలెమ్ ముగిసిన కాన్ఫరెన్స్ ఆప్పార్టీస్, 30వ అంతర్జాతీయ సదస్సు ప్రపంచ దేశాలకు, శిలాజ ఇంధనాలపై ఆధారపడటం న్యాయ, ప్రణాళికా బద్దంగా నిలుపుదల చేయాలని అడవుల నిర్మూలన అరికట్టాలని పిలుపు మళ్లీ ఇచ్చింది. పారిస్ ఒప్పందంలో ఆర్టికల్ 9 ప్రకారం ఇప్పటికే అభివృద్ధి సాధించిన సంపన్న దేశాలు, అభివృద్ధి చెందుతూ బొగ్గు, చమురు వంటి శిలాజ ఇంధనాలపై ఆధారపడిన దేశాలకు, నిధులు అందించి ఆ వినియోగం క్షీణింప చేయాలి. సాంకేతికంగా అధునాతన జ్ఞానాన్ని కూడా అందించాలి. కాని డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడైన తర్వాత ‘భూతాపం’ దుష్పరిణామాలపై అగ్ర రాజ్య దేశాధ్యక్షునికి విశ్వాసంలేకపోవడం ప్రపంచాన్నివెనక్కి నడిపిస్తోంది. ఇప్పటికే పారిశ్రామిక విప్లవ శతాబ్దాల ముందు రోజులకంటే సగటున 0.8 డిగ్రీల సెంటీగ్రేడ్ దాటిన గ్లోబల్ వార్మింగ్ కారణంగా ప్రపంచం వరదలు, తుఫాన్లు, భూకం పాలు, కరవు కాటకాలు, అగ్ని విపత్తులతో మానవాళి మృత్యు విధ్వంసం చవి చూస్తోంది. 2030 నాటికి పూర్వ అమెరికా అధ్యక్షుడు ఒబామా కాలం నాటి లక్ష్యం ప్రకారం కర్బన కాలుష్యవాయువులను విద్యుత్ ఉత్పాదన రంగంలో 2005లోని తీవ్రతకు ఎగువగా 32 శాతం క్షీణింపచేయాలి. ప్రస్తుత ట్రంప్ అధ్యక్షతన, అమెరికా విశ్వవిలయానికి ఉర్రూతలూగే సన్నాహాలు ప్రకటిస్తోంది. ‘డ్రిల్ బేబీ డ్రిల్ ట్రంప్ కట్టుకథలు ప్రపంచాన్ని ఎటు నడిపిస్తాయి?.
-జయసూర్య
Read hindi news: hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: