అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) మళ్లీ భారత్‌పై ఘాటు విమర్శలు చేశారు. వాణిజ్య సంబంధాలు పూర్తిగా అసమానంగా మారాయని, ఇది ఏకపక్ష విపత్తు”గా ఉందని ఆయన అన్నారు. భారత్ విధిస్తున్న అధిక సుంకాలు అమెరికా కంపెనీలకు పెద్ద అడ్డంకిగా మారాయని ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు.ట్రంప్ తన సోషల్ మీడియా వేదిక ‘ట్రూత్ సోషల్’లో ఈ వ్యాఖ్యలు చేశారు. దశాబ్దాలుగా భారత్ అమెరికాకు భారీగా సరుకులు అమ్ముతున్నా, అమెరికా నుంచి దిగుమతులు తక్కువగా ఉన్నాయని ఆయన ఆరోపించారు. ఇది పూర్తిగా ఒకవైపు వాణిజ్యం అని స్పష్టంగా పేర్కొన్నారు.ప్రపంచంలోనే అత్యధిక సుంకాలను భారత్ విధిస్తోందని ట్రంప్ విమర్శించారు. ఈ పరిస్థితుల్లో అమెరికా కంపెనీలు భారత మార్కెట్‌లో నిలబడలేకపోతున్నాయని అన్నారు. భారత్‌లో వ్యాపారం (Business in India) చేయడం చాలా కష్టతరమైందని ఆయన వ్యాఖ్యానించారు.
రష్యా చమురు, ఆయుధాలపై వ్యతిరేకత
అమెరికాను పక్కన పెట్టి భారత్ రష్యా నుంచి చమురు, ఆయుధాలు కొనుగోలు చేయడంపై ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అమెరికా నుంచి కాకుండా రష్యా నుంచి అవసరాలు తీర్చుకోవడం సరైంది కాదు అని ఆయన అన్నారు. ఈ నిర్ణయాల వల్ల వాణిజ్య సంబంధాలు మరింత దెబ్బతింటాయని హెచ్చరించారు.భారత్ ఇప్పుడు సుంకాలను తగ్గించడానికి సిద్ధమైందని ట్రంప్ పేర్కొన్నారు. అయితే ఈ నిర్ణయం చాలా ఆలస్యమైందని ఆయన వ్యాఖ్యానించారు. ఇది ఏళ్ల క్రితమే జరగాలి. ఇప్పుడు దాని ప్రయోజనం తక్కువ అని అన్నారు.
ఎస్‌సీవో సదస్సు తర్వాత సంచలన వ్యాఖ్యలు
చైనాలో జరిగిన ఎస్‌సీవో సదస్సులో మోదీ, పుతిన్, జిన్‌పింగ్ భేటీ అనంతరం ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేయడం ప్రత్యేక ఆసక్తి రేపింది. భారత్-రష్యా సన్నిహిత సంబంధాలు అమెరికాకు ఇష్టం లేకపోవడం స్పష్టమైంది.ట్రంప్ విమర్శలకు కొన్ని రోజుల ముందే అమెరికా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంది. భారత ఉత్పత్తులపై 50 శాతం సుంకాన్ని విధించింది. దీనికి కారణంగా భారత్ రష్యా నుంచి భారీగా చమురు దిగుమతి చేసుకోవడమే అని స్పష్టంచేసింది.ట్రంప్ విమర్శలు, కొత్త సుంకాలు భారత్-అమెరికా వాణిజ్యంపై ప్రభావం చూపే అవకాశం ఉంది. రెండు దేశాల మధ్య సంబంధాలు సున్నిత దశలోకి వెళ్లాయని విశ్లేషకులు చెబుతున్నారు. భవిష్యత్తులో ఈ వివాదం ఎలా పరిష్కారం అవుతుందో చూడాలి.
Read Also :