రష్యా నుంచి ముడి చమురు కొనుగోలు చేస్తున్నందుకు అమెరికా భారత్‌పై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ చర్యలతో ఉక్రెయిన్ యుద్ధానికి పరోక్షంగా నిధులు సమకూరుతున్నాయని అమెరికా ఆరోపించింది.
భారత్ రష్యా, చైనాలతో సన్నిహితంగా ఉంటోంది
వైట్‌హౌస్ వాణిజ్య సలహాదారు పీటర్ నవారో మాట్లాడుతూ, “భారత్ రష్యా, చైనాలతో సన్నిహితంగా ఉంటోంది. వ్యూహాత్మక భాగస్వామిగా అమెరికాతో కొనసాగాలంటే, తన వైఖరిని మార్చుకోవాలి” అని హెచ్చరించారు.
ఈ ఆరోపణలను భారత విదేశాంగ శాఖ ఖండించింది
దేశ ప్రయోజనాలకే తగిన నిర్ణయాలు తీసుకుంటామని స్పష్టం చేసింది. అమెరికా, ఐరోపా దేశాలు కూడా రష్యాతో వ్యాపారం చేస్తున్నాయని గుర్తు చేసింది.
ఫైనాన్షియల్ టైమ్స్ పత్రికలో పీటర్ నవారో ఈ వ్యాఖ్యలు చేశారు. భారత్‌ను మాత్రమే లక్ష్యంగా చేసుకోవడం సరికాదని భారత విదేశాంగ శాఖ కౌంటర్ ఇచ్చింది.
ఇక, భారత్-అమెరికా వాణిజ్య చర్చలు రద్దయిన సమయంలో ఈ వివాదం మరింత హాట్ టాపిక్‌గా మారింది. ట్రంప్ విధించిన అదనపు టారిఫ్‌లు 27వ తేదీ నుంచి అమల్లోకి రానున్నాయి. దీంతో భారత వస్తువులపై సుంకాలు 50 శాతానికి పెరగనున్నాయి.
Read also :