అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) వివిధ దేశాలపై టారిఫ్(Tariffs)లు విధించిన విషయం తెలిసిందే. అయితే చైనా, కెనడా, మెక్సికో(China, Canada, Mexico)లపై టారిఫ్‌లు విధించడం వల్ల భారత్‌కు కలిసి వస్తుందని ఇటీవల ‘ట్రేడ్ వాచ్ క్వార్టర్లీ’ ఓ నివేదికలో తెలిపింది. అమెరికా దిగుమతుల్లో 30 విభాగాలు ఉండగా అందులో 22 విభాగాల్లో భారత్‌కు ప్రయోజనం లభిస్తుంది. అమెరికా చైనాపై 30%, కెనడాపై 35%, మెక్సికోపై 25% టారిఫ్‌లు విధించింది.

భారత్ మార్కెట్ పైకి..
వీటివల్ల భారత్‌కు టారిఫ్ ప్రయోజనం లభిస్తుంది. ఈ టారిఫ్‌ల వల్ల అమెరికాలో భారత్ తన మార్కెట్ విలువను పెంచుకోవచ్చు. ఫార్మా, జౌళి, విద్యుత్ మెషినరీ వంటి రంగాల్లో వృద్ధి ఎక్కువగా ఉంటుందట. మరో ఆరు విభాగాల్లో కూడా భారత్‌కు పోటీ విషయంలో ఎలాంటి మార్పు కూడా ఉండదు. ఈ టారిఫ్‌ల వల్ల ఖనిజాలు, ఇంధనాలు, దుస్తులు, ఎలక్ట్రానిక్స్, ప్లాస్టిక్స్, ఫర్నిచర్, సముద్ర ఉత్పత్తులు వంటి వస్తువులకు లాభం చేకూరనుంది. దాదాపుగా 1,265 బిలియన్ డాలర్ల మార్కెట్‌లో భారత్‌కు ప్రాఫిట్ వస్తుంది.
అమెరికాతో సేవల ఆధారిత వాణిజ్య ఒప్పందం
భారత్ కూడా అమెరికాతో సేవల ఆధారిత వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోవాలని నీతిఆయోగ్ తెలిపింది. ఐటీ, ఆర్థిక సేవలు, వృత్తిపరమైన సేవలు, విద్య వంటి రంగాలపై దృష్టి పెట్టాలని పేర్కొంది. ముఖ్యంగా హెచ్-1బీ, ఎల్-1 వీసా ప్రక్రియలను మెరుగుపరచడంపై చర్చించాలని సూచించింది. అయితే ప్రస్తుతం భారత వాణిజ్య మంత్రిత్వ బృందం వాషింగ్టన్‌లో ఉంది. వ్యవసాయం, వాహన రంగాల్లో ఇరు దేశాలు సమస్యల పరిష్కారంపై చర్చించనున్నారు. అమెరికా భారత్‌పై 10 శాతం టారిఫ్ విధించినా కూడా భారత్ తన ఎగుమతులను పెంచుకోవడానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.
Read hindi news: hindi.vaartha.com