అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) మరోసారి ప్రపంచవ్యాప్తంగా చర్చకు దారి తీసే నిర్ణయాన్ని ప్రకటించారు. అమెరికా వెలుపల నిర్మించే ఏ సినిమానైనా ఇకపై 100 శాతం సుంకం (టారిఫ్) విధించనున్నట్లు ఆయన వెల్లడించారు.
సోమవారం తన అధికారిక సోషల్ మీడియా వేదిక ‘ట్రూత్ సోషల్’ ద్వారా ఈ ప్రకటన చేస్తూ, “అమెరికా సినిమా పరిశ్రమను కాపాడటమే నా లక్ష్యం” అని స్పష్టం చేశారు.
Pakistan : ప్రశ్నిస్తే కాల్చేస్తున్నారు – POK ప్రజలు
ట్రంప్ ప్రకారం, గత కొన్నేళ్లుగా విదేశీ సినిమాలు (Foreign movies) అమెరికా మార్కెట్‌ను ఆక్రమించాయనీ, దీని వల్ల హాలీవుడ్ చిత్రాలకు (Hollywood films) ఎదురుదెబ్బ తగలుతోందని చెప్పారు. “అమెరికా ప్రజల డబ్బు, అమెరికా కంటెంట్‌కే ఖర్చవ్వాలి. విదేశీ సినిమాలు మన పరిశ్రమను దెబ్బతీయకుండా అడ్డుకోవడమే ఈ నిర్ణయం వెనుక ఉద్దేశ్యం” అని ఆయన వ్యాఖ్యానించారు.
బలహీనమైన, అసమర్థుడైన గవర్నర్ పాలనలో ఉన్న కాలిఫోర్నియా (California) రాష్ట్రం దీనివల్ల తీవ్రంగా నష్టపోయింది. ఎన్నో ఏళ్లుగా కొనసాగుతున్న ఈ సమస్యకు ముగింపు పలికేందుకే, అమెరికా బయట చిత్రీకరణ జరుపుకునే అన్ని సినిమాలపై 100 శాతం సుంకం విధిస్తున్నాను” అని ఆయన తన పోస్టులో స్పష్టం చేశారు.

విదేశీ సినిమా నిర్మాణాలు అమెరికా జాతీయ భద్రతకు పెను ముప్పు
విదేశీ చిత్రాలపై ట్రంప్ కఠిన వైఖరి తీసుకోవడం ఇదేమీ కొత్త కాదు. గత మే నెలలో కూడా ఆయన ఇలాంటి అభిప్రాయాన్నే వ్యక్తం చేశారు. విదేశీ సినిమా నిర్మాణాలు అమెరికా జాతీయ భద్రతకు పెను ముప్పుగా పరిణమించాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. విదేశీ ప్రొడక్షన్లు అమెరికన్ ఫిల్మ్ మేకర్ల (American filmmakers) ను తమ దేశాలకు ఆకర్షిస్తూ, ఇక్కడి చిత్రాల్లోకి తమ భావజాలాన్ని,
ప్రచారాన్ని చొప్పిస్తున్నాయని ఆయన గతంలో ఆరోపించారు. ఇప్పుడు ఏకంగా 100 శాతం సుంకం విధిస్తున్నట్లు చేసిన ప్రకటనతో ఈ విషయంపై తన వైఖరిని మరింత కఠినతరం చేశారు. ఈ నిర్ణయం అమలులోకి వస్తే, అమెరికాలో విదేశీ చిత్రాల విడుదల, పంపిణీ వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది.
Read hindi news: hindi.vaartha.com
Read Also: