రష్యా చమురు కొనుగోలు చేస్తూ ఉక్రెయిన్ యుద్దం కొనసాగేందుకు కారణమవుతున్నారన్న సాకుతో భారత్ పై 50 శాతం సుంకాలు విధించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Trump) వాటిని తగ్గించే విషయంలో త్వరలో గుడ్ న్యూస్ చెప్పబోతున్నట్లు సంకేతాలు వెలువడుతున్నాయి. ఇప్పటికే ఇరు దేశాల మధ్య జరుగుతున్న వరుస చర్చల్లో ఈ మేరకు పురోగతి లభించినట్లు అధికారులు ఇప్పటికే వెల్లడించారు. అయితే ఈ డీల్ కు ముందే భారత్ కు ట్రంప్ మరో గుడ్ న్యూస్ చెప్పారు. ఇరాన్ లో భారత్ వ్యూహాత్మకంగా నిర్మిస్తున్న చబహార్ పోర్టుపై తాజాగా ట్రంప్ ఆంక్షలు విధించారు. దీంతో ఈ పోర్టు నిర్మాణంలో భాగస్వాములుగా ఉన్న భారత్, ఇరాన్ ఇరుకునపడ్డాయి. ఇజ్రాయెల్ తో యుద్దం సమయంలో పంతం ప్రదర్శించిన ఇరాన్ ను టార్గెట్ చేసేలా ఈ ఆంక్షలు విధించారు.
Read Also: America: మరోసారి వడ్డీ రేట్లను తగ్గించిన ఫెడరల్ రిజర్వ్

త్వరలో వాణిజ్య ఒప్పందం కూడా కుదిరే అవకాశం
అయితే భారత్ తో వాణిజ్య చర్చలు కొనసాగుతుండటం, త్వరలో వాణిజ్య ఒప్పందం కూడా కుదిరే అవకాశం ఉండటంతో ట్రంప్ ఇప్పుడు ఈ ఆంక్షల్ని ఆరు నెలల పాటు వాయిదా వేశారు. ఈ మేరకు భారత విదేశాంగశాఖ ఈ విషయాన్ని ఇవాళ నిర్ధారించింది. ఇరాన్ లో భారత్ నిర్మిస్తున్న చబహార్ పోర్టుకు అమెరికా విధించిన ఆంక్షలు వర్తించబోవని విదేశాంగశాఖ ఓ ప్రకటనలో తెలిపింది. ప్రస్తుతం అమెరికాతో వాణిజ్య ఒప్పందంపై నిరంతర చర్చలు జరుగుతున్నాయని నిర్ధారించింది.
రష్యా ఆయిల్ కంపెనీలపై అమెరికా ఆంక్షలు
మరోవైపు భారత్ కు చమురు సరఫరా చేస్తున్న రష్యా ఆయిల్ కంపెనీలపై అమెరికా విధించిన ఆంక్షల్ని కూడా పరిశీలిస్తున్నట్లు విదేశాంగశాఖ తెలిపింది. దీని ప్రభావాన్ని అంచనా వేస్తున్నట్లు పేర్కొంది. అంతర్జాతీయ మార్కెట్లో నెలకున్న పరిస్ధితుల ఆధారంగా తాము నిర్ణయాలు తీసుకుంటామని తెలిపింది. ఇంధన వనరుల విషయంలో తమ వైఖరి అందరికీ తెలిసిందేనని వెల్లడించింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com/
Read Also: