ఈయూపై సుంకాలు రద్దు.. ట్రంప్ యూ-టర్న్
EU tariffs : గ్రీన్‌ల్యాండ్ అంశంపై తొందరపాటు అవసరం లేదని భావించిన అమెరికా అధ్యక్షుడు Donald Trump వెనక్కి తగ్గారు. గ్రీన్‌ల్యాండ్‌కు మద్దతు ఇవ్వని యూరోపియన్ యూనియన్ (EU) దేశాలపై విధించిన సుంకాలను ఇక అమలు చేయబోమని ప్రకటించారు. నాటో సెక్రటరీ జనరల్ **Mark Rutte**తో జరిగిన ద్వైపాక్షిక సమావేశం అనంతరం ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు.
గ్రీన్‌లాండ్, డెన్మార్క్ ప్రజల పట్ల తనకు గౌరవం ఉందని ట్రంప్ తెలిపారు. “రెండో ప్రపంచ యుద్ధం తర్వాత గ్రీన్‌లాండ్‌ను డెన్మార్క్‌కు అప్పగించాం. అది అమెరికా జాతీయ భద్రతకు వ్యూహాత్మకంగా కీలకమైన ప్రాంతం. కానీ దీన్ని బలవంతంగా స్వాధీనం చేసుకోం. చర్చల ద్వారానే ముందుకెళ్తాం” అని స్పష్టం చేశారు. అరుదైన ఖనిజాల కోసమే కాకుండా భద్రతా అవసరాల కోసమే గ్రీన్‌లాండ్ ముఖ్యమని ఆయన వ్యాఖ్యానించారు.
Sudha Murthy deepfake video : నా పేరుతో వీడియోలా? నమ్మొద్దు! సుధామూర్తి హెచ్చరిక
సుంకాల్లేవు.. చర్చలే ఉత్తమ మార్గం
నాటో చీఫ్ మార్క్ రెట్టెతో సమావేశం తర్వాత ట్రంప్ (EU tariffs) ట్రూత్ సోషల్‌లో పోస్ట్ చేశారు. గ్రీన్‌లాండ్, ఆర్కిటిక్ ప్రాంత భద్రతపై ఒక ఫ్రేమ్‌వర్క్‌ను రూపొందించామని, అది అమెరికాతో పాటు నాటో మిత్ర దేశాలకు కూడా లాభదాయకంగా ఉంటుందని తెలిపారు. అందుకే ఈయూపై విధించాలనుకున్న సుంకాలను వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించారు. ఫిబ్రవరి 1 నుంచి టారిఫ్‌లు అమల్లోకి రావని స్పష్టం చేశారు.

ఈ అంశంపై అమెరికా ఉపాధ్యక్షుడు JD Vance, విదేశాంగ మంత్రి Marco Rubio తదితరులు చర్చలు కొనసాగిస్తున్నారని ట్రంప్ వెల్లడించారు. ట్రంప్ నిర్ణయాన్ని డెన్మార్క్ విదేశాంగ మంత్రి లార్స్ లోకే రాస్ముస్సెన్ స్వాగతిస్తూ, ఇది సానుకూల పరిణామమని వ్యాఖ్యానించారు.
ట్రేడ్ డీల్‌ను నిలిపివేసిన ఈయూ
ఇంతకుముందు ట్రంప్ తీసుకున్న కఠిన వైఖరికి ప్రతిస్పందనగా ఈయూ పార్లమెంట్ కీలక నిర్ణయం తీసుకుంది. అమెరికాతో ట్రేడ్ డీల్‌కు సంబంధించిన ఓటింగ్‌ను తాత్కాలికంగా నిలిపివేసింది. అమెరికా వస్తువులపై సుంకాలు తగ్గించాల్సిన ప్రతిపాదనను ఫ్రీజ్ చేయడంతో, ట్రేడ్ డీల్ ముందుకు సాగని పరిస్థితి ఏర్పడింది. ఈ పరిణామాల నేపథ్యంలోనే ట్రంప్ వెనక్కి తగ్గినట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: