Trump On India Pakistan War : టారిఫ్ హెచ్చరికలతోనే భారత్, పాక్ యుద్ధాన్ని ఆపా

Follow Us: Google News Daily Hunt
Trump On South Korea
Trump On South Korea
FONT SIZE
GET APP

Trump On India Pakistan War : అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మరోసారి భారత్-పాకిస్థాన్ సరిహద్దు ఉద్రిక్తతలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. క్యాంప్ డేవిడ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడిన ఆయన, తన పదవీకాలంలో పలు అంతర్జాతీయ వివాదాలను సమర్థవంతంగా పరిష్కరించానని పేర్కొంటూ భారత్-పాక్ యుద్ధాన్ని తానే అడ్డుకున్నానని పునరుద్ఘాటించారు. భారత్, పాకిస్థాన్ మధ్య యుద్ధం తీవ్రరూపం దాలుస్తున్న సమయంలో తాను రంగంలోకి దిగానని ట్రంప్ వెల్లడించారు. ఇరు దేశాలు వెనక్కి తగ్గకపోతే వాటిపై 250 శాతం అధిక దిగుమతి సుంకాలు (Tariffs) విధిస్తామని హెచ్చరించినట్లు ఆయన తెలిపారు. ఈ నిర్ణయంతో ఇరు దేశాలు ఆగ్రహం వ్యక్తం చేసినప్పటికీ, మరుసటి రోజే యుద్ధం కొనసాగించబోమని ప్రకటించాయని పేర్కొన్నారు. పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ తనకు ఫోన్ చేసి, రెండు అణుదేశాల మధ్య యుద్ధాన్ని ఆపడం ద్వారా దాదాపు 5 కోట్ల మంది ప్రాణాలను కాపాడారని ప్రశంసించినట్లు ట్రంప్ చెప్పారు. అయితే, ఈ వ్యాఖ్యలను భారత్ మొదటి నుంచీ ఖండిస్తూనే ఉంది. భారత్-పాక్ అంశంలో మూడో దేశం జోక్యంగానీ, మధ్యవర్తిత్వంగానీ లేదని స్పష్టం చేసింది.

Read Also: Saudi Arabia: ఎర్ర సముద్రంలో ఉద్రిక్తత.. హౌతీలపై భారీ ఆపరేషన్‌కు సౌదీ సిద్ధం!

Trump On India Pakistan War
Trump On India Pakistan War

ఇరాన్, ఉక్రెయిన్, గాజా అంశాలపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు

భారత్-పాక్ వివాదంతో పాటు పలు అంతర్జాతీయ భౌగోళిక రాజకీయ పరిణామాలపై కూడా ట్రంప్ మాట్లాడారు. ఇరాన్ తీరుపై అసంతృప్తిఇరాన్‌తో స్టీవ్ విట్‌కాఫ్, జారెడ్ కుష్నర్, జేడీ వాన్స్, మార్కో రుబియోలతో కూడిన అమెరికా బృందం చర్చలు జరుపుతున్నప్పటికీ, ఆ దేశంపై విశ్వాసం తగ్గుతోందని ట్రంప్ అన్నారు.ఇరాన్ అబద్ధాలు చెబుతూ హామీలను ఉల్లంఘిస్తోందని ఆరోపించారు. ఐసీసీ (ICC) చర్యలపై వివరణ అంతర్జాతీయ క్రిమినల్ కోర్టుపై అమెరికా తీసుకుంటున్న చర్యలు తనను కాపాడుకోవడానికి కాదని, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో పాటు ఇతర అధికారులకు రక్షణగా నిలిచేందుకేనని స్పష్టం చేశారు.

Trump On India Pakistan War : ఉక్రెయిన్‌కు పేట్రియట్ క్షిపణులు

ఉక్రెయిన్‌కు శక్తివంతమైన పేట్రియట్ ఇంటర్‌సెప్టర్ క్షిపణుల తయారీ లైసెన్స్ ఇచ్చే అంశంపై ఇంకా ఎలాంటి తుది నిర్ణయం తీసుకోలేదన్నారు. తమ ప్రాధాన్యం క్షిపణుల ఉత్పత్తి కాదని, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ముగిసి శాంతి నెలకొనడమేనని వెల్లడించారు. గాజా పరిపాలన & హమాస్ నిరాయుధీకరణగాజాలో హమాస్ మరియు ఇతర సాయుధ బలగాల నిరాయుధీకరణ ఒప్పందాన్ని ట్రంప్ ఆహ్వానించారు. నిరాయుధీకరణ పూర్తయిన తర్వాత గాజాలో కొత్త పాలస్తీనా పరిపాలన బాధ్యతలు చేపడుతుందని, అంతర్జాతీయ స్థిరీకరణ దళాలు, పాలస్తీనా పోలీసు బలగాలు భద్రతను పర్యవేక్షిస్తాయని తెలిపారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

Vanipushpa

రచయిత గురించి

Vanipushpa

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

మీకు నచ్చవచ్చు