हिन्दी | Epaper

America: నావల్లే అక్రమ వలసలు తగ్గాయి: ట్రంప్

Vanipushpa
America: నావల్లే అక్రమ వలసలు తగ్గాయి: ట్రంప్

అమెరిగా గతంలో కన్నా ఇప్పుడు మెరుగ్గా సుసంపన్నంగా మారిందని డొనాల్డ్ ట్రంప్(Trump) అన్నారు. ‘గత తొమ్మిది నెలల్లో అక్రమ విదేశీయలు ఎవరూ అమెరికాలోకి ప్రవేశించలేదు. చట్టబద్దంగా లోపలికి అమెరికాలో వచ్చే వారికి ఎల్లప్పుడూ అనుమతిస్తాం. అక్రమ వలసలను, ప్రాణాంతక ఫెంటనిల్‌లను సమర్థంగా అడ్డుకుంది. ఇక జో బైడెన్ పాలనలో దేశ చరిత్రలోనే అత్యంత దారుణమైన ద్రవ్యోల్బణాన్ని చూశాం. కానీ 12 నెలల్లో నా పరిపాలన ఐదు సంవత్సరాలకు పైగా కనిష్ఠ స్థాయికి కోర్ ద్రవ్వోల్బణాన్ని తగ్గించింది. 2025 చివరి మూడు నెలల్లో ఇది 1.7 శాతానికి తగ్గింది. గత ప్రభుత్వం నాలుగేళ్లలో అమెరికాలో 1 ట్రిలియన్‌ డాలర్ల కంటే తక్కువ పెట్టుబడులు తీసుకొస్తే, ఒక్క సంవత్సరంలోనే తన కార్యవర్గం 18 ట్రిలియన్‌ డాలర్లకు పైగా పెట్టుబడులు సాధించాం. వెనెజువెలా అధ్యక్షుడు నికోలస్‌ మదురో నిర్బంధం తర్వాత, ఆ దేశం నుంచి 80 మిలియన్‌ బ్యారెళ్లకు పైగా చమురు అమెరికాకు వచ్చాయి’ అని డొనాల్డ్ ట్రంప్ వివరించారు.

Read Also: Jharkhand Air Ambulance Crash: విధితో పోరాడి.. విమాన ప్రమాదంలో ఓడి

 America: I'm the reason illegal immigration has decreased: Trump
America: I’m the reason illegal immigration has decreased: Trump

బిగ్‌ బ్యూటిఫుల్‌ బిల్‌

ప్రపంచ దేశాలపై అమెరికా విధించిన సుంకాలను రద్దు చేస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు దురదృష్టకరమని డొనాల్డ్ ట్రంప్ అన్నారు. కానీ దాదాపు అన్ని దేశాలు తమతో కుదుర్చుకున్న ఒప్పందాన్ని కొనసాగించాలని కోరుకుంటున్నాయని అన్నారు. దశాబ్దాలుగా మనల్ని మోసం చేసిన దేశాలు ఇప్పుడు మనకు వందల బిలియన్ డాలర్లు చేల్లిస్తున్నాయని పేర్కొన్నారు. ఆధునిక ఆదాయపు పన్ను వ్యవస్థను భర్తీ చేయడానికి టారిఫ్‌లు విధించినట్లు తెలిపారు. విదేశాలపై మోపిన సుంకాలు అమెరికా ప్రజలపై ఆర్థిక భారాన్ని తగ్గిస్తాయన్నారు. బిగ్‌ బ్యూటిఫుల్‌ బిల్‌తో అమెరికన్లకు ఉపశమనమని ట్రంప్ అభివర్ణించారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ఢిల్లీ–మీరట్ ప్రయాణ సమయం 3 గంటల నుంచి 58 నిమిషాలే

ఢిల్లీ–మీరట్ ప్రయాణ సమయం 3 గంటల నుంచి 58 నిమిషాలే

వందే భారత్ ఢీకొని ఒకే కుటుంబం మృతి

వందే భారత్ ఢీకొని ఒకే కుటుంబం మృతి

నావల్లే అక్రమ వలసలు తగ్గాయి: ట్రంప్

నావల్లే అక్రమ వలసలు తగ్గాయి: ట్రంప్

శాసనమండలిలో మాటల యుద్ధం

శాసనమండలిలో మాటల యుద్ధం

మార్చి 14 నుంచి పదో తరగతి పరీక్షలు.. 5న హాల్‌టికెట్ల విడుదల

మార్చి 14 నుంచి పదో తరగతి పరీక్షలు.. 5న హాల్‌టికెట్ల విడుదల

ఇండస్ చాట్ యాప్ వచ్చేసింది.. దీని ప్రత్యేకతలు ఇవే

ఇండస్ చాట్ యాప్ వచ్చేసింది.. దీని ప్రత్యేకతలు ఇవే

భారత్- పాక్ యుద్ధాన్ని అపా..లేకపోతే 35 మిలియన్లు చనిపోయేవారు: ట్రంప్

భారత్- పాక్ యుద్ధాన్ని అపా..లేకపోతే 35 మిలియన్లు చనిపోయేవారు: ట్రంప్

పొక్సో కేసులో నిందితుడికి 20 యేళ్ల జైలుశిక్ష

పొక్సో కేసులో నిందితుడికి 20 యేళ్ల జైలుశిక్ష

ఇజ్రాయెల్‌లో మోదీ మేనియా.. ‘నమస్తే’ అంటూ స్వాగతం పలికిన టాప్ పత్రిక

ఇజ్రాయెల్‌లో మోదీ మేనియా.. ‘నమస్తే’ అంటూ స్వాగతం పలికిన టాప్ పత్రిక

ఇండియా – పోలండ్ పార్లమెంటరీ గ్రూప్ లో ఎంపి ఏలూరు పి మహేష్

ఇండియా – పోలండ్ పార్లమెంటరీ గ్రూప్ లో ఎంపి ఏలూరు పి మహేష్

ఐటీ రంగంలో ముంచుకొస్తున్న ముప్పు!

ఐటీ రంగంలో ముంచుకొస్తున్న ముప్పు!

విజయ్–రష్మిక వివాహానికి ప్రధాని మోదీ శుభాకాంక్షలు

విజయ్–రష్మిక వివాహానికి ప్రధాని మోదీ శుభాకాంక్షలు

📢 For Advertisement Booking: 98481 12870