हिन्दी | Epaper

US: కెనడా పై మండిపడ్డ ట్రంప్..ఎందుకంటే?

Vanipushpa
US: కెనడా పై మండిపడ్డ ట్రంప్..ఎందుకంటే?

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కెనడా పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రీన్‌ల్యాండ్‌పై నిర్మించాలనుకున్న “గోల్డెన్ డోమ్” క్షిపణి రక్షణ ప్రాజెక్టును కెనడా తిరస్కరించడంపై ఆయన మండిపడ్డారు. కెనడా అమెరికాకు బదులుగా చైనాతో సన్నిహిత సంబంధాలు కోరుకుంటోందని, అలా చేస్తే చైనా వారిని ఏడాదిలోనే “మింగేస్తుందని” ట్రంప్ హెచ్చరించారు. ట్రంప్ తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ “ట్రూత్ సోషల్” వేదికగా ఈ వ్యాఖ్యలు చేశారు. “గ్రీన్‌ల్యాండ్‌పై గోల్డెన్ డోమ్ నిర్మించడాన్ని కెనడా వ్యతిరేకిస్తోంది. వాస్తవానికి ఈ గోల్డెన్ డోమ్ కెనడాను కూడా రక్షిస్తుంది. కానీ దానికి బదులుగా వారు చైనాతో వ్యాపారం చేయడానికి మొగ్గు చూపుతున్నారు. అయితే చైనా వారిని ఏడాదిలోపే మింగేస్తుంది” అంటూ ఆయన పేర్కొన్నారు.

Read Also: Fern Winter Storm Usa: ఫెర్న్ తుఫాను గుప్పిట్లో అమెరికా

US: కెనడా పై మండిపడ్డ ట్రంప్..ఎందుకంటే?
US: కెనడా పై మండిపడ్డ ట్రంప్..ఎందుకంటే?

తమ దేశం పట్ల కృతజ్ఞతతో ఉండాలని డిమాండ్

ఇటీవల కెనడా ప్రధానమంత్రి మార్క్ కార్నీ వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ (WEF) వేదికగా చేసిన వ్యాఖ్యలతో ఈ వివాదం రాజుకుంది. బుధవారం డబ్ల్యూఈఎఫ్ (WEF) 56వ వార్షిక సదస్సులో ట్రంప్ (Trump) మాట్లాడుతూ.. అమెరికా నుంచి కెనడా పొందుతున్న ఉచిత సేవలకు గాను వారు తమ దేశం పట్ల కృతజ్ఞతతో ఉండాలని చెప్పారు. కానీ కెనడా ప్రధానమంత్రి ఆ స్థాయిలో కృతజ్ఞతతో లేరని ట్రంప్ అసహనం వ్యక్తం చేశారు. తాను ప్రతిపాదించిన “గోల్డెన్ డోమ్” క్షిపణి రక్షణ వ్యవస్థ కెనడాకు కూడా భద్రత కల్పిస్తుందని ఆయన నొక్కి చెప్పారు. “మార్క్ మాట్లాడే ముందు.. అమెరికా వల్లే తన దేశం మనుగడ సాగిస్తుందనే విషయాన్ని గుర్తుంచుకోవాలి” అని ట్రంప్ సూచించారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ఇరాన్ కోసం 2 రోజుల్లో రూ. 51,400 కోట్లు ఖర్చు చేసిన అమెరికా

ఇరాన్ కోసం 2 రోజుల్లో రూ. 51,400 కోట్లు ఖర్చు చేసిన అమెరికా

ఆర్థిక సంక్షోభం, పాకిస్తాన్‌లో జీతాల కోతలు

ఆర్థిక సంక్షోభం, పాకిస్తాన్‌లో జీతాల కోతలు

10 ఇరాన్ మైన్ లేయింగ్ బోట్లను లేపేసాం – ట్రంప్

10 ఇరాన్ మైన్ లేయింగ్ బోట్లను లేపేసాం – ట్రంప్

ఇండిగో సీఈఓ పీటర్ ఎల్బర్స్ రాజీనామా, సంస్థలో కీలక మార్పు

ఇండిగో సీఈఓ పీటర్ ఎల్బర్స్ రాజీనామా, సంస్థలో కీలక మార్పు

ఫోల్డబుల్ ఐఫోన్ డిజైన్ లీక్, ఐఫోన్ 18 సిరీస్‌లో రిలీజ్?

ఫోల్డబుల్ ఐఫోన్ డిజైన్ లీక్, ఐఫోన్ 18 సిరీస్‌లో రిలీజ్?

‘ఖర్గ్‌ ఐలాండ్‌’పై ట్రంప్‌ కన్ను

‘ఖర్గ్‌ ఐలాండ్‌’పై ట్రంప్‌ కన్ను

ఇంధన పొదుపు దిశగా థాయిలాండ్, వియత్నాం అడుగులు

ఇంధన పొదుపు దిశగా థాయిలాండ్, వియత్నాం అడుగులు

లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

భారత్‌లో పెరగనున్న ధరల భయం.. 1929 నాటి ఆర్థిక మాంద్యం రిపీట్ అవుతుందా?

భారత్‌లో పెరగనున్న ధరల భయం.. 1929 నాటి ఆర్థిక మాంద్యం రిపీట్ అవుతుందా?

జపాన్ లో ఆరు నెలలకు సరిపడా చమురు స్టాక్

జపాన్ లో ఆరు నెలలకు సరిపడా చమురు స్టాక్

ముంచుకొస్తున్న గ్యాస్ ముప్పు.. రూ. 10 వేల కోట్ల పైగా నష్టం!

ముంచుకొస్తున్న గ్యాస్ ముప్పు.. రూ. 10 వేల కోట్ల పైగా నష్టం!

యుద్దం ఆపడం మా చేతుల్లో పని..ట్రంప్ వ్యాఖ్యలకు ఇరాన్ కౌంటర్

యుద్దం ఆపడం మా చేతుల్లో పని..ట్రంప్ వ్యాఖ్యలకు ఇరాన్ కౌంటర్

📢 For Advertisement Booking: 98481 12870