వెనెజువెలా అధ్యక్షుడు నికొలస్ మదురో అరెస్టు అనంతరం ఆ దేశ పాలనా వ్యవహారాలను తాత్కాలికంగా అమెరికానే నిర్వహిస్తుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Trump) ప్రకటించారు. పరిస్థితులు పూర్తిగా చక్కబడే వరకు, అలాగే అధికారాల బదిలీ సురక్షితంగా జరిగే వరకు వెనెజువెలా పరిపాలనపై తమ పర్యవేక్షణ కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు.
Read Also: Maduro Arrest: అరెస్టుతో వెనిజులా రాజకీయ సంక్షోభం.. తెరపైకి డెల్సీ రోడ్రిగ్జ్

చమురు రంగం పునరుద్ధరణకు అమెరికా కంపెన్లు
వెనెజువెలాలో పూర్తిగా అస్తవ్యస్తమైన చమురు వ్యాపారాన్ని తిరిగి గాడిలో పెట్టే బాధ్యతను కూడా అమెరికానే చేపడుతుందని ట్రంప్(Trump) వెల్లడించారు. ఇందుకోసం అమెరికాకు చెందిన చమురు సంస్థలు వెనెజువెలాలో వ్యాపారం ప్రారంభిస్తాయని తెలిపారు. దీని ద్వారా వెనెజువెలాకు భారీ స్థాయిలో ఆదాయం లభించి దేశ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుందని ఆయన పేర్కొన్నారు.
మదురో అరెస్టులో అమెరికా సైన్యం కీలక పాత్ర
ఫ్లోరిడాలోని మార్-ఎ-లాగో ఎస్టేట్‌లో మీడియాతో మాట్లాడిన ట్రంప్, మదురోను మరియు ఆయన భార్యను అత్యంత భద్రత కలిగిన భవనంలో నుంచి అమెరికా సైన్యం అరెస్టు చేసి తీసుకువచ్చిందని తెలిపారు. ఇలాంటి ఆపరేషన్‌ను ప్రపంచంలో ఏ దేశం కూడా నిర్వహించలేదని ఆయన వ్యాఖ్యానించారు.
ఈ మొత్తం ఆపరేషన్‌ను తాను ప్రత్యక్షంగా లైవ్‌లో వీక్షించానని ట్రంప్ చెప్పారు. దాడి సమయంలో వెనెజువెలా రాజధానిలో విద్యుత్ సరఫరాను నిలిపివేశారని వెల్లడించారు. మదురో అరెస్టుతో వెనెజువెలా ప్రజలకు విముక్తి లభించిందని, ఇకపై ఆ దేశ పౌరులు స్వేచ్ఛగా, ఆర్థికంగా బలంగా జీవించేలా చర్యలు తీసుకుంటామని ట్రంప్ ప్రకటించారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: