ఇరాన్‌తో అణు ఒప్పందంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దూకుడును ప్రదర్శిస్తున్నారు. ఇరాన్(Iran)ను దారిలో తెచ్చుకునేందుకు అన్ని అస్త్రాలను ప్రయోగిస్తున్నారు. తాజాగా ఇరాన్‌తో అణు ఒప్పందం కుదుర్చుకోవాల్సిన అవసరంపై కీలక కామెంట్స్ చేశారు. ఈ ఒప్పందం చేసుకోవాల్సిన అవసరం అవసరం ఉందని స్పష్టం చేశారు. ఒకవేళ ఒప్పందం కుదరకపోతే ఇరాన్ తీవ్రమైన పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని ఆయన హెచ్చరించారు. గురువారం వైట్ హౌస్‌లో ఇజ్రాయెల్ ప్రధాని బెన్యామిన్ నెతన్యాహుతో భేటీ తర్వాత ట్రంప్ విలేకరులతో మాట్లాడాారు. నెతన్యాహుతో సమావేశం అత్యంత సానుకూలంగా సాగిందని పేర్కొన్నారు.
Read Also: Russia: భారత్-రష్యా స్నేహాన్ని ఎవరూ దూరం చేయలేరు..సెర్గీ లావ్రోవ్

ఇరాన్‌తో చర్చలపైనే తమ దృష్టి: ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు
ట్రంప్‌తో భేటీ అనంతరం ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు కూడా సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ఇరాన్‌తో జరుగుతున్న చర్చలపై ట్రంప్ తన అభిప్రాయం అడిగారని పేర్కొన్నారు. ఏ ఒప్పందమైనా దాని స్వరూపంపై తనకు అనుమానాలు ఉన్నాయని నెతన్యాహు చెప్పారు. గాజా, మధ్యప్రాచ్య ప్రాంతీయ పరిణామాలు వంటి ఇతర అంశాలు కూడా తమ మధ్య చర్చకు వచ్చినట్లు నెతన్యాహు తెలిపారు. అయితే ప్రధానంగా ఇరాన్‌తో చర్చలపైనే తాము దృష్టి పెట్టినట్లు తెలిపారు. గతంలో ఒప్పందానికి రాకుండా ఇరాన్ తప్పు చేసిందని ట్రంప్ భావిస్తున్నారని ఆయన చెప్పారు. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని ఇరాన్ పాఠం నేర్చుకుని మంచి ఒప్పందానికి వచ్చే అవకాశాలు ఉన్నాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ట్రంప్ కూడా అదే విశ్వసిస్తున్నారని నెతన్యాహు చెప్పుకొచ్చారు. “ఇరాన్‌తో ఒప్పందంపై ట్రంప్ నా అభిప్రాయాన్ని తెలుసుకున్నారు. ఇరాన్‌తో కుదిరే ఎలాంటి ఒప్పందమైనా నాకు సందేహాలు ఉన్నాయనే విషయాన్ని నేను దాచదలచుకోలేదు. అయితే, ఒకవేళ నిజంగానే ఒప్పందం కుదిరితే ఆ ముసాయిదాలో ఇజ్రాయెల్ కోణంలో కూడా అంశాలు ఉండాలని నేను చెప్పాను. ఆ అంశాలు కేవలం ఇజ్రాయెల్‌కే కాదు, అందరికీ ముఖ్యమైనవి అని నా అభిప్రాయం. ఇది కేవలం అణు అంశానికి సంబంధించినది మాత్రమే కాదు. ఇది బాలిస్టిక్ క్షిపణులు, ఇరాన్ ప్రాక్సీల అంశం కూడా అందులో ఉంది.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also: