అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించిన భారతీయుడు కారణంగా కాలిఫోర్నియా(California)లో రోడ్డు ప్రమాదం జరిగింది. డ్రగ్స్ మత్తులో ట్రక్‌ను నడపడం వల్ల ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. పలువురు గాయపడ్డారు. ఇండియన్ ట్రక్ డ్రైవర్‌ను పోలీసులు అరెస్ట్ చేసి కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం, ఈ ప్రమాదం దక్షిణ కాలిఫోర్నియాలోని సాన్ బర్నిర్డినో కౌంటీ ఫ్రీవే వద్ద జరిగింది. అమెరికాలో చట్టవిరుద్ధంగా నివసిస్తున్న 21 ఏళ్ల భారతీయుడు జషన్ ప్రీత్ సింగ్ డ్రగ్స్ తీసుకుని మితిమీరిన వేగంతో ట్రక్‌ను నడిపాడు.
Read Also: Caroline Leavitt: H-1B వీసా వ్యవస్థను దుర్వినియోగం చేస్తున్నారు: కరోలీనా లివిట్

ముగ్గురు వ్యక్తులు అక్కడిక్కడే మృతి
హై స్పీడ్‌లో వచ్చిన జషన్ ప్రీత్ బ్రేక్ వేయకుండా ట్రాఫిక్‌లో నెమ్మదిగా కదులుతున్న ముందున్న వాహనాలను ఢీకొట్టాడు. ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులు అక్కడిక్కడే మరణించారు. పలువురు గాయపడ్డారు. ఈ ప్రమాదంలో జషన్‌ప్రీత్ సింగ్ కూడా గాయపడ్డారు. అలాగే, ఒక మెకానిక్ కూడా గాయపడిన వారిలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదానికి కారణమైన జషన్ ప్రీత్ సింగ్‌పై డ్రగ్స్ తీసుకొని డ్రైవింగ్, హత్య వంటి అభియోగాలపై కేసులు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వైద్య పరీక్షల కోసం ఆస్పత్రికి తరలించారు. నివేదికల్లో డ్రగ్స్ తీసుకున్నట్లు తేలిందని పోలీసులు తెలిపారు.
సీసీ కెమెరాలో రికార్డు అయిన ప్రమాద దృశ్యాలు
బ్రేకులు వేయకుండానే ట్రాఫిక్ జామ్‌లోకి దూసుకెళ్లాడని పేర్కొన్నారు. ఈ ప్రమాద దృశ్యాలు జషన్‌ప్రీత్ సింగ్ నడిపిన ట్రక్‌లోని సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. అయితే మరణించిన వారి వివరాలు ఇంకా అధికారికంగా వెల్లడించలేదు. జషన్ ప్రీత్ సింగ్‌కు అమెరికాలో చట్టబద్ధమైన ఇమ్మిగ్రేషన్ హోదా లేదని యూఎస్ హోంల్యాండ్ సెక్యూరిటీ శాఖ ధృవీకరించింది. జషన్ ప్రీత్ సింగ్ అరెస్ట్ తర్వాత యునైటెడ్ స్టేట్స్ ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ (USICE) అతడిపై ఇమ్మిగ్రేషన్ డిటెన్షన్‌ను విధించింది.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: