ఫిలిప్పీన్స్(Philippines) దేశంలో తుపాన్(Toofan) విధ్వంసాన్ని సృష్టించింది. ఈ ఏడాదిలో దాదాపు 20 తుపాన్లు ఆదేశాన్ని నాశనం చేశాయి. కల్మేగి తుపాన్ బీభత్సంతో వందమందికి పైగా మరణిస్తే, పలువురి ఆచూకీ గల్లంతు అయ్యింది. జోర్దాన్ సిటీ, అగుసాన్ డెల్ సుర్ ప్రావిన్స్ లో పడిన వర్షంవల్ల వేలాది కార్లు నీటిలో కొట్టుకు పోయాయి. పలుఇళ్లకు ఇంటిపై కప్పులు ఎగిరిపోయాయి. మరికొన్ని ఇళ్లు కూలిపోవడంతో ప్రజలకు నివాసం లేక రోడ్డుపై పడ్డారు.
Read also: ఎన్డీయే నాయకులు పగటి కలలు కంటున్నారు : తివారి

సహాయక చర్యలకు వాతావరణం ఆటంకం
సహాయ చర్యల్లో భాగంగా ఐదుగురు సిబ్బందితో వచ్చిన ఆర్మీ హెలికాప్టర్ లోరెటో పట్టణం సమీపంలో కూలిపోయింది. వాతావరణం(Toofan) అనుకూలించకపోవడంతోనే ఇలా జరిగిందని ఆర్మీ ప్రకటించింది. ఈక్రమంలోనే సహాయ చర్యలు తీవ్ర ఇబ్బంది ఏర్పడింది. ఫిలిప్పీన్స్ ఇప్పటికే తరచూ భూకంపాలకు గురవుతున్నది. ఈ దేశం ద్వీపం కావడం, చుట్టూ సముద్రం ఉండడంతో తరచూ ప్రకృతి వైపరీత్యాల భారీన పడుతున్నది. ఈ ఒక్క ఏడాదిలోనే దాదాపు 20 తుపానులకు ఫిలిప్పీన్స్ గురయ్యింది. ఇప్పుడు వచ్చిన కల్మేగి తుపాను ఈ దేశాన్ని భారీ నష్టానికి గురిచేసింది. ఇళ్లు కోల్పోయి, సాయం కోసం ఎదురుచూస్తున్న ప్రజలను ఆదుకునేందుకు కూడా అధికారులకు వాతావరణం అనుకూలించడం లేదు. వందమందికి పైగానే మరణించినట్లు ఇప్పటివరకు అందిన సమాచారం బట్టి తెలుస్తున్నది. దాదాపు 30మంది వరదల్లో గల్లంతు అయ్యారు. మరిన్ని వివరాలు అందాల్సి ఉంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com/
Read Also: