గత నాలుగేళ్లుగా కొనసాగుతున్న రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలికే రోజులు దగ్గరపడ్డాయి. అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) రెండవసారి ఎన్నికైన రోజునుంచి యుద్ధాలను ఆపేందుకు తనవంతు కృషి చేస్తున్నారు. ఇజ్రాయెల్-హమాస్ లమధ్య యుద్ధాన్ని ఆపిన ఘనత ట్రంప్ కే దక్కుతుంది. థాయిలాండ్ (Thailand) -కంబోడియాల మధ్య సరిహద్దు యుద్ధాన్ని కూడా ట్రంప్ చొరవతోనే ఆగిపోయింది.
Read Also: Anthony Albanese: ఆస్ట్రేలియా హీరో అహ్మద్ ను పరామర్శించిన ప్రధాని
తాజాగా రష్యా-ఉక్రెయిన్ లమధ్య యుద్ధాన్ని ఆపేందుకు ట్రంప్ తీవ్రంగా కృషి చేస్తున్నారు. ఇందులో ట్రంఎభాగంగా.. ట్రంప్ చొరవతో రెండుదేశాల మధ్య శాంతి ఒప్పందం కుదుర్చేందుకు ప్రయత్నిస్తున్నారు.

ఫలించిన బెర్లిన్ చర్చలు
తాజాగా బెర్లిన్ వేదికగా జరిగిన చర్చలు సఫలీకృతం అయినట్లుగా తెలుస్తోంది. అమెరికా, యూరోపియన్ దేశాలైన బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ, నాటో నాయకులు, జెలెన్ స్కీ మధ్య గంటల తరబడి చర్చలు జరిగాయి. ట్రంప్ ప్రత్యేక రాయబారి స్టీప్ విట్ కాఫ్, ట్రంప్ అల్లుడు జారెడ్ కుష్నర్ సుదీర్ఘ చర్చలు జరిపారు. ట్రంప్ ప్రతిపాదించిన ప్రతిపాదన ఆధారంగా చర్చలు జరిగాయి. మొత్తానికి సుదీర్ఘ చర్చలు విజయవంతమైనట్లుగా ట్రంప్ ప్రకటించారు. సోమవారం ఓవల్ కార్యాలయంలో ట్రంప్ విలేకరులతో మాట్లాడుతూ జెలెన్ స్కీ, ఇతర నాయకులతో సుదీర్ఘంగా చాలామంచి చర్చలు జరిగినట్లుగా ప్రకటించారు.
త్వరలో శాంతి ఒప్పందం
త్వరలోనే రష్యా-ఉక్రెయిన్ మధ్య శాంతి ఒప్పందం జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. యుద్ధాన్ని కొనసాగించకూడదని యూరోపియన్ నాయకులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది. ఉక్రెయిన్ భద్రతపై అమెరికా హామీ ఇవ్వడంతో ఈ చర్చలు ఫలించినట్లుగా సమాచారం. వాషింగ్టన్ అందించే కొత్త భద్రతా హామీలపై జెలెన్ స్కీ (zelensky) సంతోషం వ్యక్తం చేశారు. అయితే రష్యాకు ఏ భూభాగాలు వదులుకోవాల్సి ఉంటుందనే దానిపై విభేదాలు మిగిలి ఉన్నాయని వ్యాఖ్యానించారు. దీనిపై రష్యా ఇంకా అధికారికంగా స్పందించలేదు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: