అమెరికా టెక్సాస్ (Texas Floods) రాష్ట్రంలో సంభవించిన తీవ్రమైన వరదలు ఎన్నో కుటుంబాల్లో తీరని విషాదాన్ని మిగిల్చాయి. ఒక సమ్మర్ క్యాంప్ సందడిగా మారాల్సిన ప్రదేశం, క్షణాల్లో శ్మశానవాతావరణంగా మారిపోయింది. హంట్ ప్రాంతంలో గ్వాడలుపే నది ఒడ్డున ఉన్న ‘క్యాంప్ మిస్టిక్’లో 109 మంది వరదల్లో ప్రాణాలు కోల్పోయారు (109 people lost their lives in the floods) .క్యాంప్ నిర్వాహకుల ప్రకారం, ఈ వరద ప్రమాదంలో 27 మంది చిన్నారులు, కౌన్సిలర్లు మరణించారు. ఆ సంఘటన తమను తీవ్రంగా కలచివేసిందని, బాధిత కుటుంబాల కోసం ప్రార్థనలు చేస్తున్నామని వారు తెలిపారు. గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని వెల్లడించారు.

వరదల సమయంలో క్యాంప్‌లో 750 మంది చిన్నారులు
విషాదం జరిగినప్పుడు క్యాంప్‌లో దాదాపు 750 మంది చిన్నారులు ఉన్నారు. ఇప్పటికీ ఐదుగురు చిన్నారులు, ఒక కౌన్సిలర్ ఆచూకీ లభించలేదు. వారికోసం గాలింపు కొనసాగుతోంది. కెర్ కౌంటీ షెరీఫ్ లారీ లీథా ఈ వివరాలు వెల్లడించారు.టెక్సాస్ గవర్నర్ గ్రెగ్ అబాట్ ప్రకారం, మొత్తం 161 మంది గల్లంతయ్యారని, గ్వాడలుపే నది పరిసర ప్రాంతాల్లో గాలింపు కొనసాగుతోందన్నారు. ఎవరికైనా తమ బంధువుల గురించి సమాచారం ఉంటే, అధికారులకు సమాచారం అందించాలని ప్రజలను కోరారు.
అత్యవసర సహాయం ప్రారంభం, ట్రంప్ విపత్తు ప్రాంతంగా ప్రకటించారు
గవర్నర్ అభ్యర్థన మేరకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, కెర్ కౌంటీని విపత్తు ప్రాంతంగా ప్రకటించారు. దీంతో సహాయక చర్యలకు మరింత బలపడే అవకాశం వచ్చింది.ఈ ఘటనపై ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రస్ స్పందించారు. సెలవుల సమయంలో చిన్నారులు ఇలా బలయ్యారు అనడం మరింత విషాదకరం అని వ్యాఖ్యానించారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
Read Also : Sports : కోహ్లీతో నాకు పరిచయం ఉంది : నోవాక్ జొకోవిచ్